Viral Video: చిన్నారిని నవ్వించేందుకు కుక్క కుప్పిగంతలు.. ఈ వీడియో చూస్తే.. అస్సలు నవ్వాపుకోలేరు..

Dog makes toddler laugh: చిన్న పిల్లలను చూడగానే.. వారితో ఆడుకోవాలని.. వారిని నవ్వించాలని ఏవేవో చేస్తుంటాం. వారు సరదాగా నవ్వుతూ కనిపిస్తుంటే.. మన ఆనందానికి

Viral Video: చిన్నారిని నవ్వించేందుకు కుక్క కుప్పిగంతలు.. ఈ వీడియో చూస్తే.. అస్సలు నవ్వాపుకోలేరు..
Dog Playing With A Toddler
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 29, 2021 | 8:07 AM

Dog makes toddler laugh: చిన్న పిల్లలను చూడగానే.. వారితో ఆడుకోవాలని.. వారిని నవ్వించాలని ఏవేవో చేస్తుంటాం. వారు సరదాగా నవ్వుతూ కనిపిస్తుంటే.. మన ఆనందానికి అవధులుండవు. అచ్చం మనషుల్లానే ఓ కుక్క కూడా పసిబిడ్డతో ఆడుకుంటూ సరదాగా ఆటపట్టిస్తూ నవ్విస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లంతా తెగ నవ్వుకుంటున్నారు. పసి హృదయాన్ని కుక్క కూడా అర్థం చేసుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ టిక్ టాక్ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.

వీడియోలో చిన్నారి కింద కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. చుట్టూ బొమ్మలు, ఓ కుక్క సైతం అక్కడ ఉంటుంది. ఈ క్రమంలో కుక్క పిల్లవాడిని అలరించడానికి అనేక చేష్టలు చేస్తూ కనిపిస్తోంది. చిన్నారిని నవ్వించేందుకు అనేక ఉపాయాలు చేస్తుంది. దగ్గరికి వచ్చి చెక్కిలిగిలిగింతలు పెట్టినట్లు చేస్తుంది. దీంతోపాటు చిన్నారి ముందు కుప్పిగంతలు వేస్తుంది. దీంతో ఆ బాలుడు బిగ్గరగా నవ్వుతూ కనిపిస్తాడు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూడండి..

ప్రస్తుతం ఈ వీడియోను చూసి నెటిజన్లంతా సంతోషంతో చిరునవ్వు చిందిస్తున్నారు. రీట్విట్‌లు, షేర్ చేస్తున్నారు.

Also read:

Miracle Hen: ఒకే రోజులో ఏకంగా 11 గుడ్లు పెట్టి వార్తల్లో నిలిచిన బంగారు కోడి పెట్ట.. ఎక్కడంటే..

TPCC: నిన్నటి వరకు చూసిన రేవంత్ రెడ్డి వేరు.. ఇప్పుడు వేరు… పీసీసీ స‌భ్యుల స‌మావేశంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.