TPCC: నిన్నటి వరకు చూసిన రేవంత్ రెడ్డి వేరు.. ఇప్పుడు వేరు… పీసీసీ సభ్యుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు.
TPCC: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నిక కావడంతో తెలంగాణలో కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చింది. అదిష్టానం నుంచి ప్రకటన వచ్చిన వెంటనే రేవంత్ పార్టీలోని సీనియర్లందరినీ కలుస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన టీపీసీసీ...
TPCC: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నిక కావడంతో తెలంగాణలో కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చింది. అదిష్టానం నుంచి ప్రకటన వచ్చిన వెంటనే రేవంత్ పార్టీలోని సీనియర్లందరినీ కలుస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన టీపీసీసీ కమిటీ పట్ల కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. ఈ విషయమై పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయాలని సభ్యులు సమావేశమై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దని.. క్రమశిక్షణగా, కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి నివాసంలో సమావేశమైన కొత్త కార్యవర్గ నాయకులు పలు విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో కొత్తగా నియమితులైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, కార్య నిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.
జులై 7న బాధ్యతలు…
ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంతర్ రెడ్డి జులై 7న పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మొదట జూబ్లిహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా నాంపల్లి దర్గా చేరుకొని అక్కడ కూడా ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం గాంధీ భవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
మాది కాంగ్రెస్ కుటుంబం: రేవంత్
కొత్తగా ఏర్పాటైన టీపీసీసీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చరిత్రలో నాలుగు రోజుల పాటు అభిప్రాయ సేకరణ చేసి పీసీసీ నియామకం చేయడం ఇదే మొదటిసారని తెలిపారు. తాను సోనియా గాంధీ మనిషినని, చిన్న వయసులో.. తక్కువ సమయంలో తనకు పెద్ద అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ గరక లాంటిదని పోల్చిన రేవంత్.. చిన్న చినుకు పడినా పచ్చగా చిగురిస్తుందన్నారు. తమది కాంగ్రెస్ కుటుంబమని కానీ స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రేవంత్ మాట్లాడుతూ.. `నేను మనస్పూర్తిగా కాంగ్రెస్ లోకి వచ్చాను. పార్టీ తక్కువ సమయంలో ఎక్కువ పదవులు ఇచ్చింది. నాకు ఎలాంటి భేషజాలు లేవు. మీ అందరి కంటే చిన్న వాడిని. మీ అందరి అభిప్రాయాలు తీసుకుని..మెజారిటీ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటాను. క్రికెట్ జట్టులా పనిచేద్దాం. సోనియా గాంధీ..రాహుల్ గాంధీలు నా పై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేస్తా. నిన్నటి వరకు చూసిన రేవంత్ రెడ్డి వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడు నేను ప్యాసింజర్ ట్రైన్ కి డ్రైవర్ ని` అని చెప్పుకొచ్చారు రేవంత్.
Also Read: LIC Loan: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్.. సులభంగా రుణాలు పొందే సదుపాయం.. ఏఏ పాలసీలపై అంటే..!
Corona Treatment: కరోనా చికిత్సకు రూ.22 కోట్లు.. ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన బిల్లును చూసి షాక్..!
Viral Video: సింగిల్‌గా ఉందని అటాక్ చేసిన సింహం.. చుక్కలు చూపించిన ఏనుగు.. షాకింగ్ వీడియో మీకోసం..