AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింగిల్‌గా ఉందని అటాక్ చేసిన సింహం.. చుక్కలు చూపించిన ఏనుగు.. షాకింగ్ వీడియో మీకోసం..

Viral Video: అడవికి రాజు సింహం అని అందరికీ తెలిసిందే. మరే ఇతర జంతువైనా సింహం కంట పడిందంటే దానికి భూమిపై నూకలు చెల్లినట్లే..

Viral Video: సింగిల్‌గా ఉందని అటాక్ చేసిన సింహం.. చుక్కలు చూపించిన ఏనుగు.. షాకింగ్ వీడియో మీకోసం..
Elephant And Lion
Shiva Prajapati
|

Updated on: Jun 29, 2021 | 6:39 AM

Share

Viral Video: అడవికి రాజు సింహం అని అందరికీ తెలిసిందే. మరే ఇతర జంతువైనా సింహం కంట పడిందంటే దానికి భూమిపై నూకలు చెల్లినట్లే అని చెప్పాలి. అందుకే.. అడవిలో ఇతర ప్రాణులు జీవించి ఉండాలంటే.. వాటికి కళ్లు, చెవులతో పాటు.. శరీరంలోని అణువణువూ అప్రమత్తంగా ఉండాలంటారు. సింహం సహజంగానే ఇతర జంతువులను వేటాడి చంపి తింటుంది. తనకన్నా బలమైన జంతువలపైనా ఏమాత్రం బెరుకు లేకుండా అటాక్ చేస్తుంది. వేటాడిందంటే గురితప్పకుండా ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా అడవి రాజు సింహం.. ఒంటరిగా ఉన్న ఓ భారీ ఏనుగును టార్గెట్ చేసుకుంది. అదును చూసి మీదకు దూకింది. ఇంకేముంది.. ఏనుగు పని అయిపోయిందనుకున్నారు సఫారీలో కూర్చిన పర్యటిస్తున్న పర్యాటకులు. కానీ ఇక్కడే అసల ట్విస్ట్ మొదలైంది. ఏనుగును పడేయడానికి సింహం తన శక్తినంతా ప్రయోగించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమే అయ్యింది. పైపెచ్చు.. తోకముడిచి ఉడాయించింది. ఒకానొక దశలో ఏనుగు పూర్తిగా నేలకూలింది. ఆ వెంటనే మళ్లీ తేరుకున్న ఏనుగు.. తన తొండంతో సింహాన్ని నేలకేసి కొట్టింది. ఆ దెబ్బకు బిత్తర పోయిన సింహం.. ఏనుగు నుంచి తప్పించుకుని బతుకు జీవుడా అంటూ పరుగులు తీసింది. మరి ఏనుగు ఊరుకుందా అంటే అదీ లేదు. ఏమాత్రం వెరవకుండా సింహాన్ని తరుముకుంటూ వెళ్లింది.

కాగా, సింహ అటాక్‌ను సఫారీ టూరిస్ట్‌లు వీడియో తీశారు. అనంతరం లైఫ్ అండ్ నేచర్ అనే ట్వి్ట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏనుగు దెబ్బకు సింహం పారిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

Viral Video:

Also read:

Redmi 10 Series: రెడ్‌ మీ 10 సీరిస్‌ మొబైల్‌ వచ్చేస్తోంది.. ట్విట్టర్‌ ఖాతాలో వీడియో విడుదల

Lord Venkateswara Ornaments: అలంకార ప్రియుడు మలయప్పస్వామిని రోజూ ఏయే ఆభరణాలతో అలంకరిస్తారో తెలుసా

Horoscope Today: ఈ రాశివారు విలువైన కార్యక్రమాలు చేపడతారు.. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు..!