Redmi 10 Series: రెడ్‌ మీ 10 సీరిస్‌ మొబైల్‌ వచ్చేస్తోంది.. ట్విట్టర్‌ ఖాతాలో వీడియో విడుదల

Redmi 10 Series: రెడ్‌ మీ వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ మొబైల్‌ కంపెనీలు రోజురోజుకు కొత్త మోడళ్ల స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా..

Redmi 10 Series: రెడ్‌ మీ 10 సీరిస్‌ మొబైల్‌ వచ్చేస్తోంది.. ట్విట్టర్‌ ఖాతాలో వీడియో విడుదల
Follow us
Subhash Goud

|

Updated on: Jun 29, 2021 | 6:33 AM

Redmi 10 Series: రెడ్‌ మీ వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ మొబైల్‌ కంపెనీలు రోజురోజుకు కొత్త మోడళ్ల స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా రెడ్ మీ 10 సీరీస్ త్వరలో భారత్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. షియోమీ దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రెడ్ మీ 9, రెడ్ మీ 9 ప్రైమ్, రెడ్ మీ 9 పవర్, రెడ్ మీ 9ఎ, రెడ్ మీ 9ఐ లకు వారసుడిగా రెడ్ మీ 10 సీరీస్ లను మార్కెట్లోకి తీసుకురానున్నారు. చైనా కంపెనీ నేరుగా రెడ్ మీ 10 సీరీస్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పనప్పటికి వచ్చే నెల ప్రారంభంలో సిరీస్ ను ఆవిష్కరించవచ్చని ట్వీట్ లో సూచించింది. ఈ మొబైల్‌లో అత్యాధునిక ఫీచర్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే రెడ్‌మీ ఇండియా ట్విట్టర్‌లో రెడ్ మీ రివల్యూషన్ అనే చిన్న క్లిప్ ను “#10on10” అనే హ్యాష్ ట్యాగ్ తో పంచుకుంది. రెడ్ మీ 10 సీరీస్ ను జూలై మొదటి వారంలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ సిరీస్ పై ఈ ట్వీట్ తప్ప ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. రెడ్ మీ 9 సీరీస్ లో రెడ్ మీ 9 ప్రైమ్ మొబైల్ ను గత ఏడాది ఆగస్టు మొదటి వారంలో భారతదేశంలో తొలిసారిగా విడుదల చేసింది. ఇలా వరుసగా ఒక్కో మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇలా అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మొబైల్‌లను విడుదల చేస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి

DOOSRA: సిమ్‌ కార్డు లేకుండానే ఫోన్‌ కాల్స్‌.. రాంగ్ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు కొత్త యాప్‌ను సృష్టించిన హైదరాబాది

Telegram Features: వాట్సాప్‌కు గ‌ట్టి పోటీనిచ్చే దిశ‌గా టెలిగ్రామ్ అడుగులు.. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో అప్‌డేట్‌..