Narender Vaitla |
Updated on: Jun 28, 2021 | 4:06 PM
గత కొన్ని నెలల క్రితం వాట్సాప్ సరికొత్త ప్రైవసీ పాలసీ తీసుకురానుందన్న వార్తల నేపథ్యంలో చాలా మంది ఇతర మెసేజింగ్ యాప్‌లవైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే.
ఇందులో టెలిగ్రామ్ కూడా ముందు వరసులో నిలిచింది. ఈ క్రమంలోనే యూజర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకునేందుకు గాను టెలిగ్రామ్ సరికొత్త ఫీచర్లను యాప్‌కు జోడిస్తోంది. టెలిగ్రామ్ తాజాగా యాడ్ చేసిన కొన్ని ఫీచర్లు..
గ్రూప్ వీడియో కాల్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానం పెరుగుతుండడంతో ఈ ఫీచర్‌ను యాడ్ చేసింది.
నాయిస్ సస్పెన్షన్, యానిమేటేడ్ బ్యాంక్‌గ్రౌండ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. దీంతో వీడియో కాల్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుకానుంది.
వీడియో కాల్‌లో ప్రత్యేకంగా స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో వీడియో కాల్స్‌లో ఉన్న వారు వారి స్క్రీన్‌ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.
వీటితో పాటు భవిష్యత్తులో గేమ్స్ స్ట్రీమింగ్, లైవ్ ఈవెంట్స్‌తో పాటు మరిన్ని సదుపాయలు తీసుకొస్తామని టెలిగ్రామ్ సంస్థ చెబుతోంది.