AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు విలువైన కార్యక్రమాలు చేపడతారు.. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు..!

Horoscope Today: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు..

Horoscope Today: ఈ రాశివారు విలువైన కార్యక్రమాలు చేపడతారు.. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు..!
Subhash Goud
|

Updated on: Jun 29, 2021 | 6:31 AM

Share

Horoscope Today: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే జూన్‌ 29న రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

​మేషరాశి

విలువైన కార్యక్రమాలు చేపడతారు. పలువురు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. వ్యాపారాలలో రాణించే ప్రయత్నాలు చేస్తారు. లలిత సహాస్ర నామ పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

వృషభరాశి

ఈ రాశివారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించడం మేలు జరుగుతుంది.

మిథున రాశి

చేపట్టే పనుల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పలు రకాల కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో మంచి పేరు సంపాదించుకుంటారు. నవగ్రహ పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి

సన్నిహితులతో కలిసి భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. మహాగణపతి పారాయణం మేలు చేస్తుంది.

సింహ రాశి

ఆ రాశివారు ఈ రోజు ఆలయాలు, ఆశ్రమాలను సందర్శిస్తారు. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తిరుతాయి. అష్టలక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది.

కన్య రాశి

వ్యవహరిక విషయాలలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. మంగళగౌరి దేవిని పూజించడం ద్వారా మంచి జరుగుతుంది.

తుల రాశి

విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. దుర్గదేవిని పూజించడం ద్వారా మేలు జరుగుతుంది.

వృశ్చిక రాశి

ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. నిలిచిపోయిన పనులు చేపట్టే ప్రయత్నాలు చేస్తారు. సూర్యనారాయణ స్తోత్ర పారాయణం వల్ల మేలు జరుగుతుంది.

ధనస్సు రాశి

ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో కలహాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఎవరితో పడితే వారితో ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం మంచిది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.

మకర రాశి

దగ్గరలోని వ్యక్తులను కలుసుకుంటారు. సభలు, చర్చ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. విష్ణు సహాస్రనామ పారాయణం మేలు జరుగుతుంది.

కుంభ రాశి

స్నేహితులతో బంధువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. వ్యాపారస్తులకు మంచి జరుగుతుంది. దుర్గదేవి అమ్మవారి దర్శనం మేలు జరుగుతుంది.

మీన రాశి

స్థిరస్తుల విషయాలలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి సందర్శనం మేలు చేస్తుంది.

Follow Us
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!