AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Treatment: కరోనా చికిత్సకు రూ.22 కోట్లు.. ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన బిల్లును చూసి షాక్‌..!

Corona Treatment: కరోనాతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే బిల్లు తడిసి మోపెడవుతోంది. కరోనా బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరాలంటేనే జంకుతున్నారు. తాజాగా కరోనా వైరస్‌ సోకి..

Corona Treatment: కరోనా చికిత్సకు రూ.22 కోట్లు.. ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన బిల్లును చూసి షాక్‌..!
Subhash Goud
|

Updated on: Jun 29, 2021 | 6:39 AM

Share

Corona Treatment: కరోనాతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే బిల్లు తడిసి మోపెడవుతోంది. కరోనా బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరాలంటేనే జంకుతున్నారు. తాజాగా కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న ఓ వ్యక్తికి భారీ షాక్‌ తగిలింది. నాలుగు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినందుకు ఆస్పత్రి యాజమాన్యం వేసిన బిల్లుకు మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది. దీంతో ఆ బిల్లును వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు బాధితుడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. నాలుగు నెలల చికిత్స చేయించుకున్నందుకు ఆ హాస్పిటల్​ 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) బిల్లు వేసింది. ఈ వివరాలను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. బిల్లుల్లును చూసి న నెటిజన్లు షాకయ్యారు. లెట్స్​టేక్​ అబౌట్ బిజినెస్​ పేరుతో ఈ వీడియోను టిక్​టాక్​లో పోస్ట్ చేశాడు ఆ వ్యక్తి. ప్రతీ సర్వీస్​కు వేసిన ధరల వివరాలను వీడియోలో స్పష్టంగా వివరించారు. క్రిటికల్ కేర్​, మెడికల్ స్కాన్స్​తో పాటు మిగిలిన సేవలు ఆ జాబితాలో ఉన్నాయి. ఇక ఈ వీడియోకు కొన్నిరోజుల్లోనే దాదాపు 95 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ బిల్లుకు షాకైన చాలా మంది కామెంట్లు చేశారు. అయితే ఇవి ఆసుపత్రి బేసిక్ రేట్స్ అని, ఒకవేళ పర్సనల్​ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బిల్లు చాలా తగ్గేదని కొందరు యూజర్లు కామెంట్ చేయగా.. మరికొందరు షాకయ్యామంటూ కామెంట్‌ చేశారు.

అయితే అమెరికాలో వైద్య ఖర్చులు భారీగానే ఉంటాయి. చికిత్స విషయంలో ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే అమెరికాలో వైద్య సదుపాయాలు కూడా అత్యంత అధునాతనంగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యత్తమ సౌకర్యాలు ఉంటాయి. అయితే మధ్య తరగతి ప్రజలు ఈ ఖర్చులను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. కాగా, అమెరికాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో ఆసుపత్రిలో చేరాడు. నాలుగు నెలల చికిత్స అనంతరం వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వైరస్ నుంచి జయించడంతో అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కానీ బిల్లు చూసిన అతనికి గుండెపోటు వచ్చేంత పనైంది. దీనికి సంబంధించిన రసీదును సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో వైపు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.

COVID-19 Testing: ఫోన్‌ స్వాబ్‌తో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు.. లండన్‌ శాస్త్రవేత్తల కొత్త విధానం

Job Opportunity: మీకు ఉద్యోగం కావాలా..? వీడియోలు చూస్తూ కూర్చోవడమే మీ పని.. నెలకు రూ.30 వేల వేతనం..!

Follow Us
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?