Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 Testing: ఫోన్‌ స్వాబ్‌తో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు.. లండన్‌ శాస్త్రవేత్తల కొత్త విధానం

COVID-19 Testing: కరోనా నిర్ధారణ పరీక్ష అంటే.. పొడుగాటి స్వాబ్‌ ముక్కులోనో గొంతులోనో పెడతారు. చాలా మందికి అది తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. కొందరైతే కోవిడ్‌..

COVID-19 Testing: ఫోన్‌ స్వాబ్‌తో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు.. లండన్‌ శాస్త్రవేత్తల కొత్త విధానం
Phone Screen Testing
Follow us
Subhash Goud

|

Updated on: Jun 25, 2021 | 7:28 AM

COVID-19 Testing: కరోనా నిర్ధారణ పరీక్ష అంటే.. పొడుగాటి స్వాబ్‌ ముక్కులోనో గొంతులోనో పెడతారు. చాలా మందికి అది తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. కొందరైతే కోవిడ్‌ పరీక్షలు అంటేనే భయపడుతుంటారు. కానీ, తప్పని పరిస్థితి. అలాంటివారికి ఆ బాధ నుంచి విముక్తి కల్పించే వినూత్న కొవిడ్‌ టెస్టును యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ (యూసీఎల్‌-యూకే) పరిశోధకులు అభివృద్ధి చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడికి పరిశోధకులు ఎన్నో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వైరస్‌ను గురించి వివిధ రకాల సులభమైన పద్దతులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఒక వ్యక్తిలో కోవిడ్‌ వైరస్‌ను గుర్తించేందుకు స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌ స్క్రీన్ల నుంచి సేకరించిన నమూనాల సాయంతో కోవిడ్‌ను వేగవంతంగా గుర్తించే చౌకైన ఒక విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. అయితే ఈ పరీక్షల నిర్ధారణ కోసం ముక్కులో, గొంతులో పొడవైన స్వాబ్‌ పెట్టకుండా పరీక్షలు నిర్వహించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పద్దతి ద్వారా సరైన ఫలితాలు పొందవచ్చంటున్నారు. బ్రిటన్‌లో యూనివర్సిటీ కాలేజీ లండన్‌ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు కొత్త పద్దతి ద్వారా కోవిడ్‌ను గుర్తిస్తున్నారు. దీనికి ఫోన్‌ స్క్రీన్‌ టెస్టింగ్‌ (పోస్ట్‌) అని పేరు పెట్టారు. ఇందులో కోవిడ్‌ అనుమానితుల నుంచి నమూనాలను నేరుగా సేకరించడానికి బదులు వారి మొబైల్‌ స్క్రీన్‌ల నుంచి స్వాబ్‌లు సేకరించి పరీక్షించారు.

ముక్కు, గొంతు నుంచి సేకరించిన స్వాబ్‌లకు నిర్వహించిన పీసీఆర్‌ పరీక్షలో కోవిడ్‌ పాజిటివ్‌ తేలిన వారు ఈ కొత్త విధానంలోనూ పాజిటివ్‌ తేలారు. ఈ విధానం ఆధారంగా ఫోన్ల నుంచి నమూనాలను సేకరించి వాటిని పరీక్షించారు. అయితే ఈ ఫలితాన్ని ఆ వ్యక్తికి నేరుగా చేరవేసేందుకు చిలీకి చెందిన అంకుర పరిశ్రమ, డయాగ్నోసిస్‌ బయోటెక్‌ ఒక యంత్రాన్ని అభివృద్ధి చేస్తోంది. ఎవరికైనా వైరస్‌ సోకి ఉంటే.. వారు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు పెద్ద ఎత్తున ఫోన్‌ స్ర్కీన్‌ మీద పడతాయి. అందుకే ఫోన్‌ తెరపై వైరస్‌ ఆనవాళ్లు ఎక్కువగా ఉంటాయి.

ఇవీ కూడా చదవండి:

Covid Vaccination: నేటి నుంచి ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ షురూ.. అన్ని జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు!

Covid-19 Vaccine: ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవే.. పారదర్శకంగానే వ్యాక్సిన్ల పంపిణీ: కేంద్రం