Haha Emoji: ‘హహ్హా’ ఎమోజీ వాడొద్దు.. ఫత్వా జారీ చేసిన మత బోధకుడు.. నెటిజన్ల రెస్పాన్స్ ఏమిటంటే..?
Bangladeshi Cleric Fatwa: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ లో వెక్కిరింత ఎమోజీ ‘హహ్హా’ను వాడటంపై బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లాం మత బోధకుడు అహ్మదుల్లా ఫత్వా
Bangladeshi Cleric Fatwa: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ లో వెక్కిరింత ఎమోజీ ‘హహ్హా’ను వాడటంపై బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లాం మత బోధకుడు అహ్మదుల్లా ఫత్వా జారీ చేశారు. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో ఆయనకు 30 లక్షల కంటే ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమేరకు ఆయన శనివారం ఆయన మూడు నిమిషాల వీడియోను పోస్ట్ చేశారు. ‘ఎవరినైనా ఎగతాళి చేయడానికి, వెక్కిరించడానికి ఫేస్‌బుక్‌లో ‘హహ్హా’ ఎమోజీని వాడుతున్నారు. ఇది ఫన్ కోసం అయితే పర్వాలేదు. కానీ ఎగతాళి చేయడమే మీ ఉద్దేశం అయితే ఇలాంటిది ఇస్లాంలో నిషిద్ధం అంటూ ఆయన పేర్కొన్నారు.
అహ్మదుల్లాకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ముస్లిం మెజారిటీ ఉన్న బంగ్లాదేశ్‌లో మతపరమైన అంశాలపై చర్చించేందుకు ఆయన క్రమం తప్పకుండా టెలివిజన్ షోలలో కనిపిస్తుంటారు. ఈ క్రమంలో ఫేస్ బుక్ లో ప్రజలను ఎగతాళి చేయడం గురించి చర్చించారు. ఇలా చేయడం నిషేధం అంటూ ఫత్వాను సైతం జారీ చేశారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుతున్నానంటూ పేర్కొన్నారు.
అయితే వీడియోను దాదాపు ఒక మిలియన్ల మంది వీక్షించి.. వేలాది మంది కామెంట్లు చేశారు. దీనిపై కొంతమంది సానుకూలంగా స్పందించారు. మరికొంతమంది వ్యతిరేకించారు. ఆయన ఫత్వా జారీ చేసిన ఎమోజీనే ఉపయోగించి.. అహ్మదుల్లాను నెటిజన్లు ఎగతాళి చేశారు.
Also Read: