Tip: బిల్లు రూ.3 వేలే.. టిప్పు రూ.12 లక్షలు..! చూసి షాక్ అయిన వెయిటర్లు..
Man surprises US restaurant staff: మనం హోటల్‌కు.. రెస్టారెంట్‌కు వెళ్తే బిల్లు చెల్లించే సమయంలో సర్వర్‌కు టిప్పు ఇస్తూ ఉంటాం. చాలామంది తాము బిల్లు చెల్లించేటప్పుడు
Man surprises US restaurant staff: మనం హోటల్‌కు.. రెస్టారెంట్‌కు వెళ్తే బిల్లు చెల్లించే సమయంలో సర్వర్‌కు టిప్పు ఇస్తూ ఉంటాం. చాలామంది తాము బిల్లు చెల్లించేటప్పుడు ఎంతోకంత నగదును టిప్పుగా ఇస్తుంటారు. కొందరు మాత్రం అసలేమీ ఇవ్వకుండానే బయటకు వస్తుంటారు. అయితే.. అమెరికాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఓ అనామిక వ్యక్తి తాను చెల్లించాల్సిన బిల్లు కంటే దాదాపు 400 రెట్ల డబ్బును టిప్పుగా ఇచ్చి.. వార్తల్లో నిలిచాడు. ఈ సంఘటన అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగింది. అయితే.. బిల్లు ఫొటోను రెస్టారెంట్ యజమాని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లంతా ఆ కస్టమర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ అభినందిస్తున్నారు.
న్యూ హాంప్‌షైర్‌లోని స్టంబుల్ ఇన్ బార్ అండ్ రెస్టారెంటుకు ఇటీవలనే ఓ కస్టమర్ వచ్చాడు. ఓ పానీయం, మరికొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్ చేశాడు. వాటికి బిల్లు కేవలం 37 డాలర్లు (సుమారు రూ.2700) మాత్రమే అయ్యింది. ఈ బిల్లు రసీదును రెస్టారెంటులో వెయిటర్‌గా పని చేస్తున్న ఓ మహిళ అయనకు ఇచ్చింది. దానిపై ఆ కస్టమర్ టిప్పుగా 16 వేల డాలర్లు (సుమారు రూ.11 లక్షలు) ఇస్తున్నట్లు రాశాడు.
అయితే.. తానిచ్చిన నగదును అంతా ఒకే చోట ఖర్చు చేయకు అంటూ.. ఆయన చెప్పడంతో ఆ మహిళ దానిని చూసింది. రసీదుపై టిప్పుగా రాసిన మొత్తాన్ని చూసి ఆమె ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. విషయం తెలుసుకున్న రెస్టారెంట్ యజమాని ఆ టిప్పును తన సిబ్బంది అందరికీ పంచాడు. దీంతోపాటు అనామక వ్యక్తి దాతృత్వాన్ని కొనియాడుతూ ఫేస్‌బుక్‌లో ఆ బిల్లు ఫొటోను షేర్ చేశాడు. ఇది చూసిన వారంతా అనామక వ్యక్తిని పొగుడుతూ పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు.
Also Read: