Tokyo Olympics: స్వర్ణం సాధిస్తే.. రూ.6 కోట్లు ..! హరియాణా అథ్లెట్లకు బంపర్ ఆఫర్

టోక్యో వేదికగా జులైలో ఒలింపిక్ క్రీడలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం అథ్లెట్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హరియాణా రాష్ట్రం నుంచి స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్లకు రూ.6 కోట్ల బహుమతి అందిస్తామని ప్రకటించింది.

Tokyo Olympics: స్వర్ణం సాధిస్తే.. రూ.6 కోట్లు ..! హరియాణా అథ్లెట్లకు బంపర్ ఆఫర్
Olympics
Follow us
Venkata Chari

|

Updated on: Jun 24, 2021 | 10:06 PM

Tokyo Olympics: టోక్యో వేదికగా జులైలో ఒలింపిక్ క్రీడలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం అథ్లెట్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హరియాణా రాష్ట్రం నుంచి స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్లకు రూ.6 కోట్ల బహుమతి అందిస్తామని ప్రకటించింది. అలాగే రజతం సాధించిన అథ్లెట్లకు రూ.4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.50 కోట్లు అందిస్తామని పేర్కొంది. ‘అంతర్జాతీయ ఒలింపిక్స్ డే’సందర్భంగా హరియాణా ప్రభుత్వం గత ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను సన్మానించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మరోహర్‌లాల్‌ ఖట్టర్‌, క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈమేరకు సందీప్ సింగ్‌ మాట్లాడారు. “రానున్న ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి తగిన విధంగా నగదు పురస్కారాలు అందిస్తామని, రాష్ట్రానికి చెందిన 30 మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారని, వారందరికీ ఇప్పటికే రూ.5 లక్షల చొప్పున నగదు అందజేశామని” ఆయన తెలిపారు. అలాగే విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఒక స్పెషల్ పాలసీని తీసుకొచ్చామని, అందులో భాగంగానే విజేతలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నట్లు, అలాగే రాష్ట్రంలో స్టేడియాలను పునరుద్ధరణ చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:

Tokyo Olympics: భారత మహిళా హాకీ జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌గా రాణి రాంపాల్ ఎంపిక

Euro Cup 2020: చరిత్ర సృష్టించేందుకు మరో గోల్ దూరంలో రొనాల్డో; 109 గోల్స్‌తో ప్రపంచ రికార్డు సమం

Make Rohit Indian Captain: ‘కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు.. కెప్టెన్‌ తోపాటు హెడ్‌ కోచ్‌ను మార్చండి’: మీమ్స్‌ తో నెటిజన్ల ఫైర్