Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Opportunity: మీకు ఉద్యోగం కావాలా..? వీడియోలు చూస్తూ కూర్చోవడమే మీ పని.. నెలకు రూ.30 వేల వేతనం..!

Job Opportunity: సీసీటీవీ ఫుటేజీ చూస్తూ కుర్చుంటే చాలు.. నెలకు రూ.30 వేల జీతం ఇచ్చేందుకు అమెరికాకు చెందిన ఓ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. వర్చువల్ సూపర్‌వైజర్‌గా..

Job Opportunity: మీకు ఉద్యోగం కావాలా..? వీడియోలు చూస్తూ కూర్చోవడమే మీ పని.. నెలకు రూ.30 వేల వేతనం..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 25, 2021 | 9:24 AM

Job Opportunity: సీసీటీవీ ఫుటేజీ చూస్తూ కుర్చుంటే చాలు.. నెలకు రూ.30 వేల జీతం ఇచ్చేందుకు అమెరికాకు చెందిన కంపెనీలు సిద్ధమవుతున్నాయి. వర్చువల్ సూపర్‌వైజర్‌గా పిలిచే ఈ ఉద్యోగం.. షాపింగ్ మాల్స్, స్టోర్స్‌లో లైవ్ సీసీటీవీ ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అలాగే అనుమానిత వ్యక్తుల గురించి క్యాషియర్‌కు చెబుతూ ఉండాలి. అంతేకాదు.. భారత్‌లో కూర్చొనే ఈ పని చేయవచ్చు. ఈ ఉద్యోగాల్లో భారతీయులకే ఆమెరికా కంపెనీలు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి. హెల్, 7-ఎలెవన్, డైరీ క్వీన్, హాలీడే ఇన్ వంటి ప్రముఖ సంస్థలు తమ స్టోర్స్‌లో మోసాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. ఈ మేరకు అపాయింట్ అయిన వ్యక్తి వర్చువల్ సూపర్ వైజర్‌గా వ్యవహరిస్తూ లైవ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి స్టోర్‌లోని ఫ్రిజ్‌లో ఉన్న కూల్‌డ్రింక్ తాగేసి.. క్యాషియర్ దగ్గరకు వచ్చాక తన కార్ట్‌లో ఉన్న వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లిస్తున్నాడనుకోండి.. ఆ వ్యక్తి ఫ్రిజ్‌లో డ్రింక్ తాగినట్టు మైక్ ద్వారా క్యాషియర్‌కు చెప్పి అప్రమత్తం చేస్తుండాలి. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి నెలకు రూ.399 డాలర్లు (రూ.30 వేలు) చెల్లించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు https://www.myliveeye.com/careers.html# ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి

Groom Cancels Marriage: పెళ్లిలో మటన్‌ కర్రీ లేదని వివాదం.. ఆ పెళ్లిన రద్దు చేసుకుని వేరే పెళ్లి చేసుకున్న వరుడు

SBI Business Loan: గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐ మరో కొత్త లోన్‌ స్కీమ్‌.. వీరు సులభంగా రుణం పొందవచ్చు..!