Groom Cancels Marriage: పెళ్లిలో మటన్‌ కర్రీ లేదని వివాదం.. ఆ పెళ్లిన రద్దు చేసుకుని వేరే పెళ్లి చేసుకున్న వరుడు

Groom Cancels Marriage: అప్పుడప్పుడు కొన్ని వివాహ కార్యక్రమాల్లో ఆశ్యర్యపోయే సంఘటనలు జరుగుతుంటాయి. పెళ్లి పీటలపైనే వివాహం ఆగిపోవడం, ఘర్షణలు జరుగుతుండటం,..

Groom Cancels Marriage: పెళ్లిలో మటన్‌ కర్రీ లేదని వివాదం.. ఆ పెళ్లిన రద్దు చేసుకుని వేరే పెళ్లి చేసుకున్న వరుడు
Live-In Marriage
Follow us
Subhash Goud

|

Updated on: Jun 25, 2021 | 8:46 AM

Groom Cancels Marriage: అప్పుడప్పుడు కొన్ని వివాహ కార్యక్రమాల్లో ఆశ్యర్యపోయే సంఘటనలు జరుగుతుంటాయి. పెళ్లి పీటలపైనే వివాహం ఆగిపోవడం, ఘర్షణలు జరుగుతుండటం, వరుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లాంటివి అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. తాజాగా ఒడిశా రాష్ట్రంలో ఓ వివాహంలో మటన్‌ కర్రీ పెద్ద తంటాలు తీసుకువచ్చింది. మటన్‌ కారణంగా పెళ్లిని రద్దు చేసుకునేంత వరకు వెళ్లింది. పెళ్లి విందులో మటన్‌ కర్రీ వడ్డించలేదని ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకున్నాడు ఓ యువకుడు. అంతేకాదు ఆ మరుసటి రోజే వేరే యువతిని కూడా పెళ్లాడాడు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తోడు పెళ్లి కొడుకు, ఇతర బంధువులు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లిలో మటన్‌ కర్రీ కావాలని తోడు పెళ్లి కొడుకు అడిగాడు. అయితే ఆ విందులో మేక మాంసం లేదు. ఆ విషయం చెప్పగానే వరుడి తరఫు వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ వివాదం చివరికి పెద్దగా మారింది. చివరకు పెళ్లి కొడుకు పెళ్లిని రద్దు చేసుకుని తన వారితో కలిసి బయటకు వచ్చేశాడు. వరుడు అతని బంధువులు జిల్లాలోని కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజే తమ్కా పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.

ఇవీ కూడా చదవండి:

SBI Business Loan: గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐ మరో కొత్త లోన్‌ స్కీమ్‌.. వీరు సులభంగా రుణం పొందవచ్చు..!

Indian Railways: తాము వెళ్లే రైలు కాదని.. కిందకు దూకిన ప్రయాణికులు.. ఒకరు దుర్మరణం..