Covid-19 Vaccine: ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవే.. పారదర్శకంగానే వ్యాక్సిన్ల పంపిణీ: కేంద్రం
Central Government: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 30 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు
Central Government: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 30 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసింది. డిమాండ్ కు అనుగుణంగా సరఫరాలో, ఉత్పత్తిలో ఆటంకం తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ సరఫరా, కేటాయింపు, కొరతపై దేశవ్యాప్తంగా పలువురి నుంచి కేంద్రంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
ఆయా రాష్ట్రాల్లో ప్రజల సంఖ్య, కరోనా కేసుల పెరుగుదల, టీకాల వృథా నియంత్రణ ప్రాతిపదికగానే రాష్ట్రాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్లను రాష్ట్రాలకు పారదర్శకంగా కేటాయించలేదని వచ్చిన మీడియా కథనాలను, పలువురి ఆరోపణలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిరాధారమైనవిగా పేర్కొంటూ కొట్టిపారేసింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ పారదర్శంగా జరుగుతోందని స్పష్టంచేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ఆధారంగానే భారత్‌లో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. క్రమబద్ధమైన ప్రణాళికను అనుసరిస్తూ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమర్థమైన భాగస్వామ్యం ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అమలు చేస్తున్నామని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. కరోనా థర్డ్ వేవ్ రావొచ్చన్న నిపుణుల అభిప్రాయం మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.
Also Read: