Covid Vaccination: నేటి నుంచి ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ షురూ.. అన్ని జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు!

తెలంగాణ వ్యాప్తంగా జులై 1 నుంచి విద్యాసంస్థలు రీఓపెన్‌ అవుతుండడంతో అధ్యాయులకు వ్యాక్సిన్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

Covid Vaccination: నేటి నుంచి ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ షురూ.. అన్ని జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు!
Covid Vaccination
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 25, 2021 | 7:02 AM

Covid Vaccination for Teachers: తెలంగాణ వ్యాప్తంగా జులై 1 నుంచి విద్యాసంస్థలు రీఓపెన్‌ అవుతుండడంతో అధ్యాయులకు వ్యాక్సిన్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి అన్ని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది వైద్య శాఖ. వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి కేంద్రంలోనూ ఓ అధికారిని నియమించింది విద్యాశాఖ. ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలో 100 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేయించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, మోడల్‌, గురుకుల విద్యాలయాల్లో బోధనా సిబ్బంది శుక్రవారం నుంచి విధులకు హాజరుకానున్నారు. ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్‌ కోసం అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు. శుక్రవారం లక్ష మంది టీచర్లకు టీకాలు వేయించాలని విద్యాశాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉపాధ్యాయులతోపాటు బోధనేతల సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక సెంటర్లలో ఉపాధ్యాయులకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలించేందుకు ఇన్‌ఛార్జ్ నియమించారు అధికారుల.

జూలై 1 నుంచి ప్రత్యక్ష పాఠాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో పాఠశాలలను సిద్ధం చేయాలని, కొత్త ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కోరింది. మరోవైపు ఉపాధ్యాయులందరికీ కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిన విద్యాశాఖ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. మరోవైపు, అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలు కూడా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గెస్ట్‌ ఫ్యాకల్టీ మినహా.. ప్రిన్సిపాల్స్‌, జూనియర్‌ లెక్చరర్లు, కాంట్రాక్టు, ఎంటీఎస్‌, బోధనేతర సిబ్బంది హాజరుకావాలని ఇంటర్‌ బోర్డు ఆదేశించింది.

కాగా, రెండో విడత కోవిడ్ విజృంభణతో అనేక మంది ఉపాధ్యాయులు ప్రాణాలను కోల్పోయారు. ఈ నెల 21 నుండి పాఠశాలలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ సౌకర్యం కల్పించి, సరైన రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

Read Also…..YS Sharmila : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు పర్యటించనున్న వైయస్. షర్మిల 

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?