Sreekutty: ‘శ్రీకుట్టి’ ఇక లేదు; పాపం ఈ ఏనుగు పిల్లకు అన్నీ కష్టాలే అంటూ నెటిజన్ల నివాళులు!

కొట్టూరు సమీపంలోని ఏనుగుల పునరావాస కేంద్రం కప్పుకాడులో ఉంటున్న శ్రీకుట్టి అనే ఏనుగు పిల్ల సోమవారం తెల్లవారుజామున చనిపోయింది. 2019 లో కొల్లం లోని అంబనాడ్ ఎస్టేట్ నుంచి ఈ ఏనుగును కాపాడారు.

Sreekutty: 'శ్రీకుట్టి' ఇక లేదు; పాపం ఈ ఏనుగు పిల్లకు అన్నీ కష్టాలే అంటూ నెటిజన్ల నివాళులు!
Elephant Calf Sreekutty
Follow us
Venkata Chari

|

Updated on: Jun 29, 2021 | 8:07 AM

Sreekutty: కొట్టూరు సమీపంలోని ఏనుగుల పునరావాస కేంద్రం కప్పుకాడులో ఉంటున్న శ్రీకుట్టి అనే ఏనుగు పిల్ల సోమవారం తెల్లవారుజామున చనిపోయింది. 2019 లో కొల్లం లోని అంబనాడ్ ఎస్టేట్ నుంచి ఈ ఏనుగును కాపాడారు. ఏడాది వయసులోనే తన తల్లి చనిపోయింది. నీటిలో కొట్టుకుపోవడంతో శరీరమంతా గాయాలు, ముందుకాళ్లు బాగా దెబ్బతినడంతో కనీసం లేవలేని పరిస్థితిలో ఉంది. ఈ స్థితిలో కేరళ ఫారెస్ట్ అధికారులు ఈ బుజ్జి ఏనుగుపిల్లను కాపాడి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడారు. అప్పుడే దీనికి శ్రీకుట్టి అని పేరుపెట్టారు. అప్పట్టో శ్రీకుట్టి నెట్టింట్లో బాగా వైరల్‌ గా మారిపోయింది. ఏడాదిన్నర వయసుగల శ్రీకుట్టి… గత రెండు రోజులుగా తీవ్రవైన జ్వరంతో బాధపడుతోంది. అయితే పోస్ట్ మార్టం నిర్వహించిన పశువైద్యులు శ్రీకుట్టి ఎండోథెలియోట్రోపిక్ హెర్పెస్ వైరస్ (ఈఈహెచ్‌వీ) కారణంగా చనిపోయినట్లు భావిస్తున్నారు. దాని శరీరంలో అంతర్గత రక్తస్రావం అయినట్లు వెల్లడించారు. మరింత లోతుగా పరిశీలించేందుకు రక్త నమూనాలను పలోడ్ లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజెస్ (ఎస్‌ఐఏడీ) కి పంపినట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ ఇ.కె. ఈశ్వరన్ మాట్లాడుతూ, సాధారణంగా 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఏనుగులకు ఇలాంటి ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయని ఎపిడెమియాలజీ అధ్యయనాల్లో ఉందని, యాంటీవైరల్, ఎసిక్లోవిర్ లాంటి మందులు ఈ వయసుగల ఏనుగులకు అందించి వైద్యం చేస్తారని తెలిపారు.

ప్రతీ మూడు నెలలకోసారి ఏనుగులకు ఇలాంటి ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చింది లేనిది పరీక్షిస్తారని ఆయన తెలిపారు. రెండు నెలల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో కేంద్రంలోని ఏనుగులకు ఇలాంటి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

గతేడాది ఘనంగా పుట్టిన రోజు.. శ్రీకుట్టి మొదటి పుట్టినరోజును గతేడాది నవంబర్ 8 న చాలా ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కేరళలోని కొట్టూర్ ఎలిఫెట్ రీహాబిలిటేషన్ సెంటర్లో చేసిన బర్త్‌ డే పార్టీలో ఓ పెద్దసైజు కేకును శ్రీకుట్టికి తినిపించారు. ఈ పార్టీకి శ్రీకుట్టితోపాటు మరో 15 ఏనుగు పిల్లలు కూడా హాజరయ్యాయి. అప్పట్లో శ్రీకుట్టి పుట్టిన రోజుల నెట్టింట్లో ఎంతో వైరల్ అయింది.

Also Read:

Viral Video: సింగిల్‌గా ఉందని అటాక్ చేసిన సింహం.. చుక్కలు చూపించిన ఏనుగు.. షాకింగ్ వీడియో మీకోసం..

Rare Pearl Cone: వలలోకి చిక్కిన అరుదైన శంఖం…!! కొనేందుకు పోటీపడ్డ వ్యాపారులు… ( వీడియో )

తన హెయిర్ నే తన డ్రెస్ గా మార్చిన యువతీ….షాక్ అవుతున్న నెటిజన్లు..వైరల్ వీడియో :Hair make dress viral video.