TRS Plenary: 27న గులాబీ పండుగ.. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..
టీఆర్‌ఎస్ ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.. హైదరాబాద్‌లోని (Hyderabad) హెచ్‌ఐసీసీ వేదికగా ఏప్రిల్ 27, మంగళవారం జరిగే ప్లీనరీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

టీఆర్ఎస్ ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.. హైదరాబాద్‌లోని (Hyderabad) హెచ్‌ఐసీసీ వేదికగా ఏప్రిల్ 27, మంగళవారం జరిగే ప్లీనరీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం ఆరు వేల మంది దాకా తరలిరానున్నారు. గులాబీ శ్రేణులు (TRS leaders) భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 27న హెచ్ఐసీసీలో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు చేపడుతున్నారు.
హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్, సైబర్ టవర్స్-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్ టూ కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు వారి సమయ వేళలను మార్చుకోవాలని అధికారులు సూచించారు.
ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంటుందని, ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ పిట్ట.. 44 బిలియన్ డాలర్లకు డీల్..
Teething in Babies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవే..