AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం..

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సామాన్యుడి రథసారథులకు తీపి కబురు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం పెరుగుతోంది.

RTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం..
Tsrtc Employees
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 26, 2022 | 10:59 AM

తెలంగాణ ఆర్టీసీ(TSRTC) ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సామాన్యుడి రథసారథులకు తీపి కబురు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం పెరుగుతోంది. వచ్చేవేతనాల నుంచి అందుకునేలా 5 శాతం డీఏను చెల్లించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మూల వేతనంపై ఐదు శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్‌ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుంది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంది. ఈ డీఏ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ.5 కోట్ల వరకు భారం పడుతుం దని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఉద్యోగులు 2019లో సుదీర్ఘ సమ్మె చేయటం, తర్వాత కోవిడ్‌ దెబ్బతో.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిని, డీఏల చెల్లింపు ఆగిపోయింది. ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మందితోపాటు 2019 జూలై నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది వర్తింపు.

ఆరు డీఏలు కలిపి 27శాతం వరకు రావాల్సి ఉందని.. వెంటనే చెల్లించాలని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా డీఏ పెంపుపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. బకాయిల అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు ఆర్టీసీ యాజమాన్యం.

ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్‌ మస్క్‌ చేతిలోకి ట్విట్టర్‌ పిట్ట.. 44 బిలియన్‌ డాలర్లకు డీల్‌..

Teething in Babies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవే..