Hyderabad: డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. ఎవరెవరున్నారంటే..
మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ర్యాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్ పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ వాళ్లంతా బాడాబాలు పిల్లలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ముందు ముగ్గురే పట్టుబడినా.. తీగ లాగితే డొంక కదులుతోంది. పార్టీ చేసుకున్నవాళ్లందరినీ వెతికిపట్టుకుంటున్నారు పోలీసులు. పెడ్లర్ కూడా పట్టుబడటంతో డ్రగ్స్ మూలాలను చేధిస్తున్నారు పోలీసులు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ర్యాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్ పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ వాళ్లంతా బాడాబాలు పిల్లలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ముందు ముగ్గురే పట్టుబడినా.. తీగ లాగితే డొంక కదులుతోంది. పార్టీ చేసుకున్నవాళ్లందరినీ వెతికిపట్టుకుంటున్నారు పోలీసులు. పెడ్లర్ కూడా పట్టుబడటంతో డ్రగ్స్ మూలాలను చేధిస్తున్నారు పోలీసులు. హోటల్ ఓనరే పార్టీ అరేంజ్ చేయడంతో.. మనల్నెవడ్రా ఆపేది అనుకున్నారు. మందేస్తూ.. చిందేస్తూ.. డ్రగ్స్ సేవిస్తూ.. పార్టీ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్‌పై రైడ్ చేశారు. అప్పటికే పార్టీ పూర్తి చేసుకుని ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయారు. సోదాలు జరిపిన పోలీసులు.. హోటల్లో 1200, 1204 రూమ్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. కొకైన్ సేవించిన ర్యాపర్లను స్వాధీనం చేసుకున్నారు.
పార్టీ చేసుకున్న రూమ్స్.. హోటల్ డైరెక్టర్ వివేకానందవిగా గుర్తించారు. హోటల్లో సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివేకానంద ఇంటికి వెళ్లిన పోలీసులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. ఇంట్లోకి పోలీసులను రానివ్వకుండా.. సోదాలు జరపనివ్వకుండా.. అడ్డుపడ్డారు వివేకానంద. ఇంట్లో ఉన్న డ్రగ్స్‌ను కూడా వాష్ రూమ్‌లో వేసి ఫ్లష్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకానందను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. వివేకానంద బీజేపీ నేత యోగానంద్ కుమారుడు మాత్రమే కాదు.. మంజీరా మాల్, రాడిసన్ బ్లూ హోటల్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. మంజీరా కన్‌స్ట్రక్షన్స్‌కు ఎండీగా ఉన్నారు. కోట్ల రూపాయలున్నాయి. జల్సాలకు తక్కువేం లేదు. ఫెరారీ కార్లతో రేసింగ్‌లు కూడా వివేకానందకు అలవాటే. సినీ సెలబ్రిటీలతో కలిసి విదేశాల్లో పార్టీలు కూడా చేసుకున్నారు. తాజాగా తన ఫ్రెండ్స్ ను గ్యాదర్ చేసి తన హోటల్ లోనే డ్రగ్ పార్టీ నిర్వహించారు.
వివేకానంద, కేధార్నాథ్‌లతో పాటు.. నిర్భయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరికి సయ్యద్ జాఫ్రి అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ సప్లై అయినట్లు గుర్తించి సయ్యద్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ముందుగా ముగ్గురు డ్రగ్ కన్జూమర్లు మాత్రమే పట్టుబడ్డా.. పార్టీలో ఉన్న మిగతా వ్యక్తులందరినీ పోలీసులు పట్టుకున్నారు. అందులో మరికొందరు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, బడా బాబుల పిల్లలు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. వివేకానంద, కేదార్నాథ్, నిర్భయ్లతోపాటు వ్యాపారవేత్త సందీప్, సెలబ్రిటీలు కూడా పార్టీలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద, కేదార్నాథ్, నిర్భయ్‌లకు పరీక్షలు జరపగా పాజిటివ్ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే.. వివేకానందకు కూకట్‌పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీజ్ చేసిన తన మొబైల్లో ఉన్న వివరాలను కూడా అంతర్గతం చేయొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పది వేల రూపాయల పూచీకత్తు పై బెయిల్ మంజూరు చేసింది.
రాడిసన్ బ్లూ హోటల్ లో డ్రగ్ పార్టీలు కొత్తేం కాదు. గతంలోనూ బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోనూ నిర్వహించిన డ్రగ్ పార్టీలోనూ 25 మంది పట్టుబడ్డారు. అందులో కొందరు సెలబ్రిటీలు, బడా బాబుల పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మాదాపూర్ రాడిసన్ బ్లూ హోటల్ అడ్డాగా డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదంటున్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. డ్రగ్ పార్టీలు జరిపినా.. డ్రగ్ పట్టుబడ్డా హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్‌ను విచారించి కూపీ లాగుతున్నారు పోలీసులు. సయ్యద్‌కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.? ఈ పార్టీకి కాకుండా ఇంకా ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా.? అనే లింకులపై ఆరా తీస్తున్నారు. పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ 9 మందిపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..