Telangana: నిరుద్యోగులకు శుభవార్త.. ప్రతి నెల జాబ్ మేళా మంత్రి కోమటిరెడ్డి..
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇకపై రాష్ట్రంలో ప్రతినెల జాబ్ మేళాను నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యువత ఎంప్లాయ్ గానే కాకుండా ఎంప్లాయ్ క్రియేటర్ గా మారాలని ఆయన కోరారు. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇకపై రాష్ట్రంలో ప్రతినెల జాబ్ మేళాను నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యువత ఎంప్లాయ్ గానే కాకుండా ఎంప్లాయ్ క్రియేటర్ గా మారాలని ఆయన కోరారు. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ స్కిల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళాకు ఇప్పటివరకు 20 వేల మంది యువతీ, యువకులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తం 127 కంపెనీలు 12,733 ఉద్యోగాలు కల్పించే ఎందుకు ఈ జాబ్ మేళాను నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెల వివిధ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి చెప్పారు. కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించుకుంటూ మళ్లీ చదువుకుంటూ అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు. నా కూతురు కూడా జాబ్ సంపాదించుకున్న తర్వాత మరో 150 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగిందనీ ఆయన చెప్పారు. ఎంజి యూనివర్సిటీలో ఖాళీల భర్తీ సీఎం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని, ఇప్పటికే రూ.100 కోట్లు యూనివర్సిటీ అభివృద్ధికి కేటాయించామని కోమటిరెడ్డి చెప్పారు. ఈ జాబ్ మేళాలో సుమారు 13,000 మందికి 127 పెద్ద కంపెనీలు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయని, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అరవిందో వంటి కంపెనీలు జిల్లాకు వచ్చి ఉద్యోగాలు కల్పించడం సంతోషకరమని కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ సీఈవో నారెడ్డితో అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..