AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బెడ్ రూమ్‌లో పరాయి వ్యక్తితో భార్య రొమాన్స్.. ఏంట్రీ ఇచ్చిన భర్త.. ఇంకేముందీ..!

తనను మోసం చేస్తూ.. స్థానిక నేతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్య గుట్టును రట్టు చేశాడు ఓ భర్త. అర్థరాత్రి పక్కా ప్లాన్‌తో కుటుంబ సభ్యులతో కలిసి వీరి బాగోతాన్ని బట్టబయలు చేశాడు. వారిద్దరికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగు చూసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Telangana: బెడ్ రూమ్‌లో పరాయి వ్యక్తితో భార్య రొమాన్స్.. ఏంట్రీ ఇచ్చిన భర్త.. ఇంకేముందీ..!
Illicit Relationship
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 26, 2024 | 1:08 PM

Share

తనను మోసం చేస్తూ.. స్థానిక నేతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్య గుట్టును రట్టు చేశాడు ఓ భర్త. అర్థరాత్రి పక్కా ప్లాన్‌తో కుటుంబ సభ్యులతో కలిసి వీరి బాగోతాన్ని బట్టబయలు చేశాడు. వారిద్దరికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగు చూసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో స్థానిక నేత పసుపులేటి శ్రీనుతో ఓ మహిళా అనైతిక సంబంధం కొనసాగిస్తుంది. నాలుగేళ్లుగా కొనసాగుతున్న వీరి వ్యవహారాన్ని సదరు మహిళ భర్త గుర్తించాడు. పద్దతి మార్చుకోవాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోగా కక్ష పెంచుకున్న భార్య.. ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించేందుకు ప్లాన్ వేసింది. విషయం తెలుసుకున్న భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితం లేకపోయింది. పైగా అతన్నే జైలు పాలు చేసింది భార్య.

ప్రియుడైన స్థానిక నేత శ్రీను పలుకుబడితో గృహహింస కేసు పెట్టి భర్తను జైలుకు పంపింది. 20 రోజులు జైల్లో ఉండి విడుదలైన భర్త, భార్య బాగోతాన్ని బయట పెట్టాలని భావించాడు. తన భార్యను, శ్రీనును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు స్కెచ్ వేశాడు. కుటుంబ సభ్యుల సహాయంతో రాత్రి తన భార్య, శ్రీను ఇద్దరూ ఏకాంతంగా ఉండగా గదికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమక్షంలో అర్థరాత్రి వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు భర్త. వీరిద్దరిని చితకబాదిన భర్త, అతని కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…