AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness World Record: కూచిపూడి డ్యాన్స్‌లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్.. డీపీఎస్ స్టూడెంట్స్ ఘనత

భారతదేశం ప్రతిభ, సాంస్కృతికవారసత్వానికి నిదర్శనం కూచిపూడి సాంప్రదాయ నృత్య రూపం. గిన్నిస్ రికార్డ్ కోసం చేసిన ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ మేము సైతం అంటూ.. దేశంలో కూచిపూడి డ్యాన్స్ కు ఉన్న ఆదరణ ఏమిటో చెప్పకనే చెప్పేశారని DPS వరంగల్ యాజమాన్యం చెబుతోంది. అంతేకాదు 3872 మంది విద్యార్థులు కలిసి అతి పెద్ద కూచిపూడి నృత్య ప్రదర్శనను విజయవంతం చేసిన తమ విద్యార్థుల అంకితభావం పట్ల తాము గర్వంగా ఉన్నట్లు వెల్లడించింది. 

Guinness World Record: కూచిపూడి డ్యాన్స్‌లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్.. డీపీఎస్ స్టూడెంట్స్ ఘనత
Kuchipudi Dance Dsp Student
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 09, 2024 | 6:14 PM

Share

భారతీయ సాంప్రదాయ కళలకు ప్రాణం పోస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వేదికగా వరంగల్ కు చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ డ్యాన్స్ లో తమ ప్రతిభను చూపించి ప్రపంచ రికార్డ్ ను సృష్టించారు. వారం రోజుల క్రితం గచ్చిబౌలి స్టేడియంలో  భారత్ ఆర్ట్స్ అకాడమీ  ఆధ్వర్యంలో కూచిపూడికళా వైభవం మహా బృంద నాట్య  కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ పాల్గొని ఈ ఘనతను సాధించారు.

గిన్నిస్ రికార్డ్ ను నెలకొల్పేందుకు ఏర్పాటు చేసిన ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి  హాజరైన భారతీయులు, సాంస్కృతిక వైవిధ్యాన్నిప్రదర్శించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ అయిన అంగూరి శ్లోక, M. జోష్విక, సారా సంజన, బిల్లా నేతన్య, గుర్రపు శర్వాణి ప్రాతినిధ్యం వహించారు. కూచిపూడి నృత్యంపై ఈ స్టూడెంట్స్ కు ఉన్న అంకిత భావం, నైపుణ్యం, అభిరుచి.. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం అని ఆ స్కూల్ యాజమాన్యం ప్రశంసల వర్షం కురిపించింది. అంతేకాదు ప్రపంచ రికార్డును సాధించి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడానికి వీరి కృషి గణనీయంగా దోహద పడిందని పేర్కొన్నారు.

గిన్నిస్ వర్డ్ రికార్డ్ కోసం

భారతదేశం ప్రతిభ, సాంస్కృతికవారసత్వానికి నిదర్శనం కూచిపూడి సాంప్రదాయ నృత్య రూపం. గిన్నిస్ రికార్డ్ కోసం చేసిన ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ మేము సైతం అంటూ.. దేశంలో కూచిపూడి డ్యాన్స్ కు ఉన్న ఆదరణ ఏమిటో చెప్పకనే చెప్పేశారని DPS వరంగల్ యాజమాన్యం చెబుతోంది. అంతేకాదు 3872 మంది విద్యార్థులు కలిసి అతి పెద్ద కూచిపూడి నృత్య ప్రదర్శనను విజయవంతం చేసిన తమ విద్యార్థుల అంకితభావం పట్ల తాము గర్వంగా ఉన్నట్లు వెల్లడించింది.

CBSE సిలబస్ ను భోదించే ఒక ప్రముఖ విద్యాసంస్థ DPS . స్టూడెంట్స్ కు చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక రంగాలను కూడా పరిచయం చేస్తూ ప్రతి విషయంలో అగ్ర స్థానంలో నిలబడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. ఈ స్కూల్ 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో స్టూడెంట్స్ ను   IIT, NITలతో పాటు ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో అడుగు పెట్టె విధంగా కెరీర్ ని తీర్చిదిద్దింది.

విద్యా రంగంలో వరంగల్ పరిసర ప్రాంతాల వారు ఉత్తమ CBSE పాఠశాలగా DPS ని ఎంచుకోవచ్చు అంటూ చెబుతున్నారు పాఠశాల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వి. రవికిరణ్ రెడ్డి.  అంతేకాదు అన్నిరంగాలలో ప్రతిష్టాత్మకంగా రాణిస్తూ, ముఖ్యంగా, కళల పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటున్న తమ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ , వరంగల్

2014లోస్థాపించబడిన DPS వరంగల్, తెలంగాణలోని వరంగల్లో CBSE-అనుబంధ కో-ఎడ్, రెసిడెన్షియల్ ,  డే-స్కూల్. ఉత్తర తెలంగాణలోని హన్మకొండ, వరంగల్, కాజీపేటట్రై-సిటీ  ఏరియాలో సేవలందిస్తున్న ఈ పాఠశాల  X , XII,  CBSE బోర్డు పరీక్షలలో ప్రతీ సంవత్సరం నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తున్న రికార్డ్ ను సొంతం చేసుకుంది. 2021లో మొదటిప్రయత్నంలోనే  ICAI,  ICMAI పరీక్షలకు అర్హత సాధించారు ఈ స్కూల్ స్టూడెంట్స్.

మరిన్ని వివరాలకు సంప్రదించండి: info@dpswarangal.in | మొబైల్: 96426 94433 | వెబ్‌సైట్: https://dpswarangal.in/

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..