Telangana LRS Scheme: రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్.. డేట్ ఫిక్స్..
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. LRS దరఖాస్తులు, లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. సరైన అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అవకాశం కల్పించింది. అప్పుడు 25 లక్షలకు పైగా LRS దరఖాస్తులు వచ్చాయి.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. LRS దరఖాస్తులు, లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. సరైన అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అవకాశం కల్పించింది. అప్పుడు 25 లక్షలకు పైగా LRS దరఖాస్తులు వచ్చాయి. అయితే క్రమబద్ధీకరణ చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు వాటిని క్రమబద్ధీకరించునే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. కోర్ట్ పరిధిలో ఉన్న భూములతో పాటు ప్రభుత్వ, దేవదాయ, వక్ఫ్ బోర్డ్ భూముల్లో ఉన్న లేఅవుట్లు మినహా మిగిలిన భూముల్లో ఉన్న లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దరఖాస్తుదారులకు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. దీని ద్వారా 10వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కాగా.. ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకుముందు క్రమబద్దీకరణ నిలిచిపోవడంతో.. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని మళ్లీ భవననిర్మాణ అనుమతులు పొందేందుకు చాలామంది సన్నద్ధమవుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..