Hyderabad Drugs: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. స్మగ్లర్ అరెస్ట్.. 108 మంది పేర్ల వెల్లడి..!

Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం రేపుతోంది. డ్రగ్స్‌ స్మగ్గింగ్‌ చేస్తున్న నైజీరియన్‌ను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad Drugs: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. స్మగ్లర్ అరెస్ట్.. 108 మంది పేర్ల వెల్లడి..!
Drugs
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 13, 2022 | 10:05 AM

Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం రేపుతోంది. డ్రగ్స్‌ స్మగ్గింగ్‌ చేస్తున్న నైజీరియన్‌ను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసే 108 మంది పేర్లు గుర్తించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియాకు చెందిన ఓసీగ్వే జేమ్స్‌.. వీసా గడువు ముసిగిపోయినా ఇండియాలోనే ఉంటూ గోవా, హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సప్లై చేస్తున్నాడు. ఇతనిపై హెచ్‌న్యూవింగ్‌ టీమ్‌ నిఘాపెట్టింది. గోవా నుండి హైదరాబాద్‌ వచ్చి కింగ్‌ కోఠిలో డ్రగ్స్‌ విక్రయిస్తుండగా అతన్ని సెంట్రల్‌ జోన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గరి నుంచి 30 గ్రాముల MDMA డ్రగ్స్‌, 4 సెల్‌ఫోన్లు, ఖతార్‌, కెమెన్‌, ఐలాండ్‌ దేశాలకు చెందిన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

MDMA డ్రగ్స్‌ చాలా కాస్ట్‌లీ అన్నారు సెంట్రల్ జోన్‌ డీసీపీ రాజేశ్‌ చంద్ర. 2013లో మొదటిసారి ఇండియా వచ్చి వెళ్లిపోయిన అతను..మళ్లీ 2022లో రీ ఎంట్రీ ఇచ్చాడు. వీసా గడువు ముగిసి పోయినా హైదరాబాద్‌లో ఉంటూ డ్రగ్స్‌ అమ్మకాలు చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. గతంలో గోవాలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడని..మూడు నెలలు జైలులో ఉండి బయటకు వచ్చిన తర్వాత పేరు మార్చుకొని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడని డీసీపీ తెలిపారు. జేమ్స్‌ ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు సెంట్రల్‌ జోన్‌ పోలీసులు గుర్తించారు. జేమ్స్‌ దగ్గర డ్రగ్స్‌ కొనుగోలు చేసే 108 మంది వినియోగదారులను గుర్తించామన్నారు డీసీపీ.

నైజీరియాలో ఉన్న స్నేహితుడి ద్వారా డ్రగ్స్ తెప్పించి.. గ్రాము 7 వేల రూపాయలకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. నైజీరియాకు చెందిన డ్రగ్స్ అమ్మే వారు ఏడుగురు ఇక్కడ ఉన్నారని.. అందులో నలుగురిని వారి దేశాలకు పంపించామన్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ సరఫరాపై సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పోలీసులు హెచ్‌న్యూవింగ్‌ టీమ్‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత డ్రగ్స్‌ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. హెచ్‌న్యూవింగ్‌ టీమ్‌ రంగంలోకి దిగాక 60 కేసులు నమోదుకాగా, 250 డ్రగ్స్‌ ప్లెడ్లర్స్‌ను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..