Hyderabada: పుష్ప సినిమా స్ఫూర్తితో.. హైదరాబాద్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్‌.. నలుగురు అరెస్ట్‌

దేశంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలగా కొనసాగుతుంది. ఈజీగా కోట్లు రూపాయలు డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తుంది ముఠా .

Hyderabada: పుష్ప సినిమా స్ఫూర్తితో.. హైదరాబాద్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్‌.. నలుగురు అరెస్ట్‌
Hyderabad Police
Follow us
Basha Shek

|

Updated on: Oct 05, 2022 | 6:37 AM

ఎర్రచందనం స్మగ్లింగ్ ఏపీకే పరిమితం అనుకుంటే ఇప్పుడు తెలంగాణా కూడా పాకింది. అక్రమ మార్గంలో పుష్ప సినిమా సీన్స్ను తలపించేలా ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. దేశంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలగా కొనసాగుతుంది. ఈజీగా కోట్లు రూపాయలు డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తుంది ముఠా . పుష్ప సినిమా సీన్స్ ను తలపించేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పోలీసులు ముందు కుదేలు అవుతున్నారు. రీల్ పుష్ప మిల్క్ ట్యాంకర్ ను ఎంచుకోగా.. రియల్ పుష్పలు బైక్‌లు ఉపయోగించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ముందుగా పుష్ప సినిమా లాగా శాంపిల్స్ తీసుకొచ్చి డీల్ కుదుర్చుకుంటారు.. ఆ తర్వాత కావాల్సిన సరుకును అందజేస్తున్నారు..

పక్కా సమాచారంతో..

కడప జిల్లా ప్రొద్దుటూరు కి చెందిన షేక్ అబ్దుల్లా అనే ప్రధాన నిందితుడు మరో నలుగురు ముఠాగా చేసుకొని ఈ దందా చేస్తున్నాడు. కడప జిల్లాకు చెందిన రవి చంద్ర అనే వ్యక్తి ద్వారా ఎర్ర బంగారాన్ని తీసుకొని ముజాహిద్దీన్ ద్వారా హైదరాబాద్ కి చేరవేర్చి వాటిని విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. నలుగురిని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నాయి పోలీస్ టీమ్స్. ఈ ముఠా నుంచి 75 లక్షలు విలువైన 500 కిలోల ఎర్ర చందనం ను సీజ్ చేశారు .

గతంలోనూ..

కాగా ఆంధ్ర ప్రదేశ్ నుండి దేశ వ్యాప్తంగా వేరే రాష్ట్రాలకు ఇది స్మగ్లింగ్ చేస్తున్నారని గుర్తించారు పోలీసులు. గతంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ రవి చంద్ర చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా నిందితుల పై 447, 427, 379,120- B , 109 రెడ్ విత్ 34 IPC కింద కేసులు నమోదు చేశామన్నారు పోలీసులు. ఈ కేసులో విచారణ చేస్తున్నామని.. పరారీ లో ఉన్న నిందితుడు రవి చంద్ర ను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!