Telangana: గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేసిన పోలీసులు
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగటానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమర్జనానికి అందుబాటులో ఉన్న చెరువులను సిద్ధం చేశారు అధికారులు. అన్ని ప్రాంతాల్లో కూడా జరిగే గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వ పరంగా కూడా వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 18వ తేదీన మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి.

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగటానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమర్జనానికి అందుబాటులో ఉన్న చెరువులను సిద్ధం చేశారు అధికారులు. అన్ని ప్రాంతాల్లో కూడా జరిగే గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వ పరంగా కూడా వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 18వ తేదీన మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సుమారు 35,000 పైగా వినాయకులను ప్రతిష్టించినట్టు అంచనా వేస్తున్నారు . చెరువు వద్ద భారీ క్రేన్ లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ నగరం చుట్టుపక్కల ఉన్న వివిధ చెరువుల్లో వేల వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. అవసరం మేరకు చివరి రోజు వరకూ మరిన్ని క్రేన్‌లను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
అయితే వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేందుకు పోలీస్ లు నిరంతరం పని చేస్తూ భద్రతాపరంగా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రజలు శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకునేందుకు ముందస్తు ప్రణాళికతో పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల అధికారులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. గణేశ్ నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో, నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రతిష్ఠించిన గణేశ్ విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు. గణేష్ నిమజ్జనం మొదలుకొని అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగేలా, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. నిమజ్జన విషయానికి వస్తే నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సందర్భంగా GHMC అధికారులు ముందుగానే చెరువులు, బేబీ పాండ్స్ ను సూచించి అక్కడ అవసరమున్న మేర వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు, క్రేన్లను ఏర్పాటు చేశారు.
చెరువు కట్టల వద్ద లైట్లను, బ్యారికేడ్లను నిర్మించి భక్తుల సౌకర్యార్థం మంచి నీటి సౌకర్యం, ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు అంబులెన్సులు కూడా సిద్ధం చేసి ఉంచారు. ప్రజలు,భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమత్తు పనులు, శానిటైజేషన్ పనుల చేపట్టారు. వినాయక నిమజ్జన విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, వలంటీర్లకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు. నిమజ్జనం రోజు ఆయా రూట్లలో జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ, ఆర్ అండ్ బీ శాఖల మరియు ఇతర శాఖల సమన్వయంతో నిమజ్జనోత్సవం సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు పోలీసులు. డయల్ 100కు వచ్చే కాల్స్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు. విజిబుల్ పోలిసింగ్‌తో పాటు సీసీటీవీ మానిటరింగ్ కూడా ఉంది. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయడానికి అంత సిద్ధం చేసారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




