AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: క్రైంజోన్‌గా మారుతున్న ఫన్ హబ్..! అసలు మొయినాబాద్‌లో ఏం జరుగుతుంది!

హైదరాబాద్‌ శివారులో ఫన్‌ హబ్‌గా కొనసాగుతున్న మొయినాబాద్​ ప్రాంతం ఇప్పుడు క్రైమ్​ జోన్​ గా మారిపోతుంది. ఇన్నాళ్లు ఫ్యామిలీ ఫంక్షన్‌లు, ప్రైవేట్‌ పార్టీలకు ఉపయోగించే అక్కడి ఫామ్‌ హౌస్‌లను.. లీజుకు తీసుకుని కోళ్ల పందాలు, గ్యాంబ్లింగ్​ గేమ్స్ వంటి వికృత కార్యాలకు నిలయంగా మార్చేస్తున్నారు కొందరు బెట్టింగ్‌ రాయుళ్లు.

Hyderabad: క్రైంజోన్‌గా మారుతున్న ఫన్ హబ్..! అసలు మొయినాబాద్‌లో ఏం జరుగుతుంది!
Representative Image (2)
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 25, 2025 | 2:39 PM

Share

హైదరాబాద్ నగర శివారు ఫామ్ హౌస్‌లలో మత్తెక్కించే పెద్ద పెద్ద ఈవెంట్లు డైలీ జోరుగా జరుగుతున్నాయి. మొయినాబాద్,​ చేవెళ్ల పోలీస్​ స్టేషన్​ లిమిట్స్​ లలో వందలాది ఫాంహౌజ్​ లు ఉన్నాయి. పేరొందిన రిసార్ట్స్​ లు ఉన్నాయి. చిన్నపాటి బర్త్​ డే ఫంక్షన్​ అయినా ఫాంహౌజ్​ లు డిజే చప్పుళ్లతో దద్దరిల్లిపోతున్నాయి. కలర్​ ఫుల్​ లైటింగ్​స్​ .. అమ్మాయిల డ్యాన్స్​ లు… ఆపై మద్యం కిక్కుతో పార్టీలు, ఫంక్షన్లతో ఫాంహౌజ్​ లు, రిసార్ట్స్​ లు మెరిసిపోతున్నాయి. తాజాగా వీటికి తోడు కోళ్ల పందాలు, గ్యాంబ్లింగ్​ గేమ్స్​ ఎంటర్​ అయ్యాయి. బెట్టింగ్​ రాయుళ్లు ఫాంహౌజ్​ లను లీజుకు తీసుకుని మరీ వికృత కార్యాలకు నిలయంగా మార్చేస్తున్నారు. ఫన్​ హబ్​ గా ఉన్న మొయినాబాద్​ ను క్రైమ్​ జోన్​ గా మారిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇవన్నీ లోకల్​ పోలీసులకు తెలియడం లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క మొయినాబాద్​ పోలీస్​ స్టేషన్​ లిమిట్స్​ లో ఈ యేడాది స్పెషల్​ ఆపరేషన్​ టీమ్స్​ 39 ఫాంహౌజ్​ లపై దాడులు నిర్వహించింది. ఫాంహౌజ్​ లో కోళ్ల పందాలు నడుపుతున్న సంఘటనలు రెండుసార్లు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు అరెస్ట్​ చేసి కేసులు పెట్టిన తర్వాత.. మళ్​లీ మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడటంతో వీరి వెనక ఎవరున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తోల్కట్టలోని ఓ ఎమ్మెల్సీకి సంబంధించిన ఫాంహౌజ్‌ను లీజ్‌కు తీసుకుని కోళ్ల పందాలు నిర్వహించారు కొందరు బెట్టింగ్ రాయుళ్లు. బాకారంలో ఓ ఫాంహౌజ్​ ను చంద్రశేఖర్​ లీజుకు తీసుకుని కోళ్ల పందాలు నిర్వహించారు. బాకారంలో ఎస్​ కే ఫాంహౌజ్‌లో యుగాండ, ఆఫ్రికా తదితర దేశాలకు చెందిన 51 మంది డ్రగ్స్​ పార్టీ నిర్వహించారు.

SOT బృందం దాడులు చేసి వారిని పట్టుకుంది. చిన్నమంగళారంలోని చెర్రీఒక్స్​ ఫాంహౌజ్​ లో 50 మంది యువత డ్రగ్స్​ పార్టీ నిర్వహిస్తూ పట్టుబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇన్ని జరుగుతున్నా SOT బృందం దాడులు చేసే వరకు లోకల్​ పోలీసులకు నిజంగా తెలియడం లేదా ? తెలిసినా ఇవేమీ కనిపించనట్లు నటిస్తున్నారా ? అన్న దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ముజ్రా పార్టీలు.. రేవ్​ పార్టీలు.. ట్రాప్ హౌస్ పార్టీలు పేర్లు ఏదైనా అక్కడ జరిగేది మాత్రం విందులు., చిందులే. వీటికి తోడు బెట్టింగ్​ రాయుళ్లు ఫాంహౌజ్​ లను అడ్డాలుగా మార్చుకుని దందాలు చేస్తున్నారు. హైదరాబాద్​ నగరానికి కేవలం 40 నిమిషాల దూరంలో ఉన్న మొయినాబాద్​ ప్రాంతంలో నైట్​ లైఫ్​ కల్చర్​ వికృత పోకడలకు దారితీస్తోంది.

ఇకనైనా ఫామ్ హౌస్ కార్యకలాపాలపై ప్రత్యేక డ్రైవ్ చేపడతారా ? లోకల్ పోలీస్ పర్యవేక్షణలో ఎలాంటి మార్పులు చేస్తారు ? మోయినాబాద్ ప్రాంతం ‘రేవ్ జోన్’గా మారకుండా సైబారాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. డిసెంబర్​ 31 నైట్​ కు ఇప్పటి నుంచే ఫాంహౌజ్​ లు, రిసార్ట్స్​ లు స్పెషల్​ పార్టీలకు రెడీ చేస్తున్నారు. పోలీసుల యాక్షన్​ ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us