AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా గోడు పరిష్కరించండి మహాప్రభో.. తహసీల్దార్ కార్యాలయంలో రైతు దంపతులు ఏం చేశారంటే..

ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.. అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఎక్కడి సమస్య అక్కడే అన్నట్లు తయారైంది. తన సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు చెందిన రైతు ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే అడ్డంగా పడుకొని వినూత్న నిరసన తెలిపాడు.

మా గోడు పరిష్కరించండి మహాప్రభో.. తహసీల్దార్ కార్యాలయంలో రైతు దంపతులు ఏం చేశారంటే..
Khammam Incident
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 25, 2025 | 2:02 PM

Share

ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.. అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఎక్కడి సమస్య అక్కడే అన్నట్లు తయారైంది. తన సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు చెందిన రైతు ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే అడ్డంగా పడుకొని వినూత్న నిరసన తెలిపాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగింది.. వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలంలోని గువ్వలగూడెంకు చెందిన రైతు కొలిపాక రామదాసు, భారతమ్మ.. తమ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పడుకుని నిరసన తెలిపారు. తన భార్య కొలిపాక భారతమ్మ పేరు మీద రికార్డు ఉన్న భూమికి ఆధారాలు ఉన్నప్పటికి అధికారులు భూమి చూపించడం లేదని రామదాసు ఆవేదన వ్యక్తంచేశాడు.. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ పట్టించు కోవడంలేదని తెలిపాడు.. తహసీల్దార్ కార్యాలయంలో రైతు వినూత్నంగా నిరసన తెలపడంపై అధికారులు ఆరాతీసినట్లు సమాచారం..

వీడియో చూడండి..

కార్యాలయానికి వచ్చే వారికి చేదు అనుభవం..

అధికారులకు ప్రజవాణి కార్యక్రమంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి మండల ప్రజలు కార్యాలయానికి వస్తే వారికి చేదు అనుభవం ఎదురైంది. ఒక్క అధికారి కూడా ప్రజావాణి కి సమయానికి హాజరు కాలేదు. ఉదయం 10.30 అయినప్పటికీ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సైతం లేకపోవడంతో ప్రజలు చెట్ల కిందనే ఎదురు చూస్తూ కూర్చున్నారు. ప్రజావాణికి అధికారులు ఖచ్చితంగా హాజరుకావాల్సి ఉన్నప్పటికీ తమకు సంబంధం లేనట్లే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయం కోసం పని నిమిత్తం వచ్చిన ప్రజలు ఎంత సమయం అయినా తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది రాకపోవడంతో వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నేలకొండపల్లి మండల అధికారులు ప్రజావాణి కి హాజరయ్యే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us