Rain Alert: వామ్మో మళ్లీ వానలు.. మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ
తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు విదర్భ సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణశాఖ పేర్కొంది.

హైదరాబాద్ వాతావరణశాఖ తెలంగాణకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ కేంద్ర హెచ్చరికల ప్రకారం.. గురువారం తూర్పు విదర్భ దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గడిచిన ఆరు గంటల్లో ఉత్తర, వాయువ్య దిశలో కదిలి శుక్రవారం ఉదయం 08:30 గంటలకు వాయువ్య ఝార్ఖండ్ దాని సమీపంలో కొనసాగుతోంది.
ఈ తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ బీహార్ మీదుగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ సహా పలు తీర ప్రాంత జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం, శనివారం, ఆదివారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజల జీవనం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. ఈ తుఫాన్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా మరోసారి వర్షాల హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




