Telangana: జైలుకు వెళ్లొచ్చినా ఆ బుద్ధే చూపించిన దుర్మార్గుడు.. భార్యను నాటు తుపాకీతో కాల్చి..
Bhadradri Kothagudem News: గతంలో అడవి జంతువులను వేటాడుతూ నాటు తుపాకితో పట్టుబడ్డాడు.. బెయిల్ పై బయటకు వచ్చాడు.. మళ్లీ ఇదే దారిని ఎంచుకుని అడ్డొచ్చిన భార్యను రోజూ హింసించేవాడు.. ఈ క్రమంలో కుటుంబ కలహాలు తీవ్రమయ్యాయి.

Bhadradri Kothagudem News: గతంలో అడవి జంతువులను వేటాడుతూ నాటు తుపాకీతో పట్టుబడ్డాడు.. బెయిల్ పై బయటకు వచ్చాడు.. మళ్లీ ఇదే దారిని ఎంచుకుని అడ్డొచ్చిన భార్యను రోజూ హింసించేవాడు.. ఈ క్రమంలో కుటుంబ కలహాలు తీవ్రమయ్యాయి. దీంతో భార్త దారుణానికి ఒడిగట్టాడు.. భార్యను నాటు తుపాకీతో విచక్షణారహితంగా కాల్చాడు. ప్రస్తుతం భార్య చావుబతుకల మధ్య ఆసుపత్రిలో పోరాడుతోంది. భార్యను.. భర్త నాటు తుపాకీతో కాల్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, పుల్లుడుతండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడు మండలం పుల్లుడు తండాకి చెందిన సామ్య ఆలియాస్ శంకర్, లావుడ్యా శాంతి దంపతులు.. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు.
గతంలో శంకర్ నాటు తుపాకీతో జంతువులు వేటాడిన కేసులో అరెస్టయి.. బెయిల్ పై ఇటీవలనే బయటకు వచ్చాడు. మళ్లీ ఇదే దారిని ఎంచుకుని శంకర్ తుపాకీతో జంతువుల వేటని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య శాంతిను తరచూ వేధిస్తూ.. ఆమెను హింసిస్తున్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం శంకర్.. భార్య శాంతిని నాటు తుపాకీతో కాల్చాడు. దీంతో ఆమె వెన్నపూసకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శాంతి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసుల సహాయంతో స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాటు తుపాకీతో కాల్చటంతో శాంతి వెన్నుపూస పూర్తిగా దెబ్బతిని.. పరిస్థితి విషమంగా ఉందని అప్పుడే ఏమి చెప్పలేమంటూ కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గాయపడిన శాంతిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్య కోసం హైదరాబాదు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన జూలూరుపాడు పోలీసులు.. భర్త లావుడ్యా శంకర్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు వద్ద నాటు తుపాకీ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..