Telangana: తెలంగాణలో ఆపరేషన్ విలేజ్..! లోకల్ ఫైట్‌కు ఎజెండాలు సిద్ధం చేసిన పార్టీలు
పార్టీల ప్రతి అడుగు లోకల్ ఫైట్ వైపే పడుతున్నాయి. నిన్న మొన్నటిదాకా నీళ్ల పంచాయితీ నడిచింది. మూడు పార్టీలూ వాయిస్ వినిపించాయి. ఇంత రచ్చ జరిగింది స్థానిక పోరులో పైచేయి కోసమే. బీసీలకు రిజర్వేషన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లు నడిచాయి. దాని వెనక అంతరార్ధం కూడా జరగబోయే పల్లె పోరే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 'టార్గెట్-100' అంటూ ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది అధికార పార్టీ. ఈ పంచాయతీ ఎన్నికలే 2028కి సెమీ ఫైనల్స్ కాబట్టి.. ప్రతిపక్షాలూ కౌంటర్ ఇచ్చాయి. ఎలా చూసుకున్నా సరే స్థానిక సంస్థల ఎన్నికలను మూడు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

డీకోడ్ చేస్తే గానీ తెలియవు కొన్ని విషయాలు. ఫలానా చర్య వెనక అంతటి ప్రతిచర్య దాగుందా అని ఊహించడమూ కష్టమే ఒక్కోసారి. అధికార పార్టీ గానీ, ప్రతిపక్షాల వ్యూహాలు గానీ అలాగే ఉన్నాయి. ఉదాహరణకు.. రేషన్‌కార్డుల పంపిణీ. 25 నుంచి ఆగస్టు 10 వరకు తెలంగాణలో అట్టహాసంగా జరగబోతోంది ఈ కార్యక్రమం. మండలాల వారీగా రేషన్‌కార్డుల పంపిణీ జరగాలని కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. మరో విషయం ఏంటంటే.. ఈ పంపిణీలో స్థానిక ఎమ్యెల్యేలు ఉండాలి, జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులూ తప్పనిసరిగా హాజరు కావాలి. ఇదీ కండీషన్. రేషన్ కార్డుల జారీ ఓ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇస్తూనే.. దీన్నొక భారీ కార్యక్రమంగా డిజైన్ చేశారు. పనిలోపనిగా బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో రేషన్ కార్డులు ఎన్నిసార్లు పంచారు, ఎంతమంది లబ్ధిపొందారో చెప్పాలనే సవాల్ విసరడానికి కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటోంది అధికార పార్టీ. సో, ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం స్థానిక పోరులో గెలవడమే. కొత్తకార్డులు, రేషన్‌లో సన్న బియ్యం, సన్నబియ్యం పండించిన రైతుకు బోనస్.. ఇవన్నీ పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తున్నాయి పార్టీకి. అంతా సవ్యంగానే ఉందనుకున్న సమయంలో క్షేత్రస్థాయిలో ఓ సమస్య కనిపిస్తోంది. యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా ఉందని ఫోకస్ చేస్తోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. తమ హయాంలో పంట కాలం వస్తోందనగానే.. యూరియా బస్తాలను, విత్తనాల ప్యాకెట్లను సిద్ధంగా ఉంచామనేది బీఆర్ఎస్ వాదన. గత...
