AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor: బ్రాండ్‌ సేమ్‌.. బాటిల్ సేమ్.. లేబుల్ సేమ్.. రేట్ సేమ్… సరుకే..

ఆ విస్కీలో కిక్కు మిస్సింగ్! బ్రాండ్‌ సేమ్‌.. బాటిల్ సేమ్.. లేబుల్ సేమ్.. రేట్ సేమ్... సరుకే.. బోత్ ఆర్ నాట్‌ సేమ్! ఏపీ-తెలంగాణ బార్డర్లో బద్దలైన మందు దందా. ఔను.. ఇది తాగితే తొందరగానే పోతావ్! సగం నీళ్లు, కొంత స్పిరిట్‌, కొంతే మద్యం.

Liquor: బ్రాండ్‌ సేమ్‌.. బాటిల్ సేమ్.. లేబుల్ సేమ్.. రేట్ సేమ్... సరుకే..
Fake Liquor
Ram Naramaneni
|

Updated on: Jul 22, 2025 | 9:52 PM

Share

కిక్‌1, కిక్‌2 చూశారు.. ఇది కిక్‌త్రీ స్టోరీ. మంబుబాబులకు ఎక్కిన కిక్కును వదలగొట్టే నకిలీ లిక్కర్ కహానీ. బాటిల్ మీద లేబుల్ చూసి ఖరీదైన బ్రాండ్‌ అనుకుని వేలు పోసి కొనుక్కుంటారు. తనివితీరా సేవిస్తారు. కానీ.. ఏదిరా మనకెక్కాల్సిన కిక్కు అని బేజారైపోతున్నారా? అలా ఐతే మీరు తీసుకున్నది బ్రాండెడ్ బాటిల్ కాదు. బ్రాండెడ్ ముసుగులో మీకు అంటగట్టిన నకిలీ సరుకు. ఎస్… ఫేమస్ బ్రాండ్లను కూడా చీప్‌ లిక్కర్ కంటే చీప్‌గా మార్చేసి.. డ్రింకర్లను బోల్తా కొట్టిస్తున్నారు కేటుగాళ్లు.

తాగితే పోతావ్ అని లిక్కర్ బాటిల్ మీద రాస్తారు. కానీ.. ఇది తాగితే తొందరగానే పోతావ్ అని హెచ్చరిస్తోంది అబ్కారీ శాఖ. కిక్కు తగ్గడమే కాదు.. తాగినవాళ్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసే భయంకరమైన దందా ఒకటి బయటకు వచ్చింది. మందుబాబుల గుండెలు పగిలే బ్రేకింగ్‌ వార్త ఇది. బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో నకిలీ మద్యం తయారుచేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా తెలుగు రాష్ట్రాల్లో తాజా సంచలనం. . హైదరాబాద్‌, సూర్యాపేట జిల్లాలో కేటుగాళ్లను పట్టుకుని కూపీ లాగుతున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో నకిలీ మద్యం తయారీ గోడౌన్‌పై ఏపీ ఎక్సైజ్‌ పోలీసులు చేసిన దాడులతో బైటపడింది ఈ నకిలీ సరుకు దందాగిరీ. కోదాడలో కూడా మరో ముఠా పనిచేస్తున్నట్టు తెలీడంతో తెలంగాణ ఎక్సైజ్ అధికారుల్ని అలర్ట్ చేశారు.

ఒరిజినల్‌ ఖాళీ బాటిల్స్‌ను సేకరించి, అందులో సగం నీళ్లు, కొంత స్పిరిట్‌, కొంత మద్యం కలిపి.. సీల్‌ వేసి అచ్చం బ్రాండెడ్‌ బాటిల్స్‌లాగా మార్కెట్లోకి వదులుతున్నాయి మద్యం ముఠాలు. హైదరాబాద్‌లోని కృష్ణ ఫార్మా అనే స్పిరిట్ కంపెనీ నుంచి టన్నులకొద్దీ స్పిరిట్ కొనుగోలు చేసి, ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లోని ఒక రైస్‌మిల్లులో కల్తీ విస్కీ తయారు చేస్తారు. ఏకంగా 178 బ్రాండ్లను కల్తీ చేశాయి ముఠాలు. ఖరీదైన బ్రాండ్ల సీసాలను సేకరించి వాటికి సరిపడా మూతలు, లేబుళ్లను తయారు చేసుకుని.. ఒరిజినల్‌ బ్రాండ్‌కు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ సరుకును మార్కెట్లో పెట్టేశారు. గతంలో ఏపీలోని మార్కాపురం, రేపల్లె, అమలాపురంలో ఈ ముఠా నకిలీ మద్యాన్ని విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడ తీగలాగితే సూర్యాపేట.. ఆ తర్వాత హైదరాబాద్లో ఈ డొంక కదిలింది.

సూర్యాపేట జిల్లా కల్తీ విస్కీ తయారీ కేసులో ఊహించని ట్విస్ట్‌ ఇంకోటుంది. త్వరలో రాబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ విధంగా పెద్దఎత్తున నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఓటుకు బాటిల్ పథకంలో భాగంగా ఖరీదైన బ్రాండెడ్ బాటిళ్లు ఆశచూపి ఓటర్లను ఫిదా చేయాలన్నది వీళ్ల స్కెచ్చు. ఐదుగురిపై కేసు నమోదైంది. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. కీలక నిందితుడు శివశంకర్‌ ఇంకా పరారీలో ఉన్నాడు. ఎక్సైజ్‌ దాడుల్లో 20 లక్షల రూపాయల విలువైన 840 లీటర్ల నకిలీ మద్యం స్వాధీనమైంది.

తాగేవాడికే కాదు.. అమ్మేవాడిక్కూడా తెలీదు. అంత పక్కాగా ఉంటుంది వీళ్ల స్టయిలాఫ్ మాన్యుఫ్యాక్చరింగ్. డిపార్ట్‌మెంట్ అధికారులు తదేకంగా పరిశీలిస్తే తప్ప అది నకిలీ సరుకు అని తెలుసుకోలేరు. ఆ రేంజ్‌లో రాటుదేలిపోయారు నకిలీ సరుకు తయారీగాళ్లు.

సో.. బార్డర్లో బద్దలైన మందు దందాతో… రెండు రాష్ట్రాల్లో మందుబాబులకు పెద్ద ప్రమాదమే తప్పినట్టుంది. కానీ.. దొరికింది వీళ్లు. దొరకని ముఠాలు ఎన్నో. వాళ్లందరి ఆట కడితే తప్ప నకిలీ బ్రాండెడ్ మందుకు ఫుల్‌స్టాప్ పడ్డట్టు కాదు.

Follow Us
రూ. 1 లక్షను రూ. 87 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్..
రూ. 1 లక్షను రూ. 87 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్..
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం