వరుణా.. కరుణించవా..? చేతికొచ్చిన పంటను చూసి అన్నదాతల కన్నీరు..

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలకు పంట తడిసి ముద్దవుతోంది..ఈదురుగాలులు, వడగళ్ల వానకు చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.. ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలకు ఆగమవుతుండడంతో రైతులు గుండెలు బాదుకుంటూ కంటనీరుపెడుతున్నారు.

Follow us

|

Updated on: May 01, 2023 | 11:33 AM

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలకు పంట తడిసి ముద్దవుతోంది..ఈదురుగాలులు, వడగళ్ల వానకు చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.. ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలకు ఆగమవుతుండడంతో రైతులు గుండెలు బాదుకుంటూ కంటనీరుపెడుతున్నారు. తెలంగాణలో అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న, మామిడి తదతర పంటలకు నష్టం వాటిల్లింది.. మెదక్‌లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అంటున్నారు అన్నదాతలు.

అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్నదాతను అకాల వర్షాలు దెబ్బతీసాయి.. పలు ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొట్టుకుపోయింది.. ఆ ధాన్యాన్ని చూసి బోరున విలపిస్తున్నారు రైతులు.. ఈదురు గాలుల‌తో కూడిన వడగండ్ల వాన కురిసి చేతికంది వచ్చిన వరిపంట నేలపాలైంది.

ఏపీలోనూ భారీ వర్షం కురిసింది.. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి.. ఆరబెట్టిన ధాన్యంను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రైతులు.. సంచులు కొరత, లారీలు రాకపోవటం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మరో వారం పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో మరో ఐదు రోజులు, ఏపీలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..