Heavy Rains: భారీ వర్షాలతో ముంచెత్తుతున్న వరదలు.. ఆ జిల్లాలో విద్యాసంస్థలు మూసివేత
Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాగులు వంకలు నిండిపోయి పొంగిపొర్లు తున్నాయి. కొన్నేళ్లుగా నిండని ప్రాజెక్టులు సైతం పూర్తిగా స్థాయిలో నిండిపోయి జలకళ..
Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాగులు వంకలు నిండిపోయి పొంగిపొర్లు తున్నాయి. కొన్నేళ్లుగా నిండని ప్రాజెక్టులు సైతం పూర్తిగా స్థాయిలో నిండిపోయి జలకళ సంతరించుకుంటున్నాయి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. వరదల కారణంగా జీనజీవనం స్తంభించిపోతోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక రాష్ట్రంలోని వికారాబాద్, పూడూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వికారాబాద్ జిల్లోలో విద్యాసంస్థలన్నీ మూసివేశారు అధికారులు. విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తుగా సెలవు ప్రకటించారు. ప్రజలు ఎలాంటి రోడ్లపై నీరు పొంగిపొర్లుతుండటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. మూసీవాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది. వందలాది ఎకరాల్లోని పంట నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇక జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. గండిపేట 12 గేట్లు, హిమాయత్‌నగర్ 8 గేట్లను ఎత్తి నీటిని దిగువన వదులుతున్నారు. రెండు జలాశయాల నుంచి 12వేల క్యూసెక్కల నీటిని విడుదల చేస్తున్నారు. పరిగి, వికారాబాద్, చేవెళ్లలో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇక గండిపేట్ వరదలో చిక్కుకున్న కుటుంబంను ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సురక్షింతంగా బయటకు తీసుకువచ్చింది. గండిపేట్‌లో ఒక్కసారిగా వరదనీరు రావడంతో ఫామ్‌హౌస్‌లో ఐదుగురు చిక్కుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి