Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Credit Card: రెండు నెలల్లో అందుబాటులోకి క్రెడిట్‌ కార్డ్‌ యూపీఐ పేమెంట్ సేవలు.. ఛార్జీలు ఉంటాయా.? అసలేంటీ విధానం..

UPI Credit Card: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌) పేమెంట్స్‌ విధానికి దేశ వ్యాప్తంగా భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే...

UPI Credit Card: రెండు నెలల్లో అందుబాటులోకి క్రెడిట్‌ కార్డ్‌ యూపీఐ పేమెంట్ సేవలు.. ఛార్జీలు ఉంటాయా.? అసలేంటీ విధానం..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 27, 2022 | 7:44 AM

UPI Credit Card: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌) పేమెంట్స్‌ విధానికి దేశ వ్యాప్తంగా భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రకరకాల పేమెంట్స్‌ యాప్స్‌ అందుబాటులోకి రావడం చిన్న చిన్న కిరాణాల దుకాణాల నుంచి పెద్ద షోరూమ్‌ల వరకు ఈ సేవలను ఉపయోగించుకోవడంతో యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ భారీగా పెరిగాయి. అయితే యూపీఐ పేమెంట్స్‌ చేసుకోవడం కోసం ఇప్పటి వరకు డెబిట్‌ కార్డులను మాత్రమే ఉపయోగిస్తున్నాం. అంటే సేవింగ్స్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బులను మాత్రమే యూపీఐ పేమెంట్స్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే తాజాగా క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్స్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రెండు నెలల్లో ఈ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విధానాన్ని అమలు చేయడానికి చాలా బ్యాంకులు ఆసక్తి కనబరుస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆసక్తికనబరుస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం మనం రూపే డెబిట్ కార్డు ద్వారా జరిపుతోన్న యూపీఐ పేమెంట్స్‌పై ఎలాంటి చార్జీలు లేవు. అయితే క్రెడిట్ కార్డ్‌ ద్వారా చేసే లావాదేవీలపై చార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు సైతం క్రెడిట్ కార్డుతో చేసే లావాదేవీలపై చార్జీలు ఉండాలనే వాదనను తెర మీదికి తీసుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే క్రెడిట్‌ కార్డు ద్వారా చేసే లావాదేవీలపై వ్యాపారులు రెండు శాతం ‘మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌’ చెల్లించాల్సి ఉంటుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీనిలో 1.5 శాతం కార్డు జారీ సంస్థలకు వెళ్లనుండగా.. మిగిలిన 0.5 శాతం ఛార్జీ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ సదుపాయం కల్పించే సంస్థలకు (పేటీఎమ్‌, ఫోన్‌పే) వెళ్లనున్నాయి. త్వరలోనే ఈ ప్రతిపాదనలను ఆర్‌బీఐకి పంపనున్నారు. సెప్టెంబర్‌ మూడో వారం నుంచి యూపీఐ-క్రెడిట్‌ కార్డు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారులకు 2శాతం చార్జీలు వేస్తే వినియోగదారులపై ఎంత వసూలు చేస్తారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..