Telangana Rains: మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు అంటే నెల 30 వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, కామారెడ్డి, భద్రాద్రి, నిజామాబాద్, ఖమ్మం, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్ధిపేట, వికారాబాద సహా మొత్తం 13 జిల్లాలకు ఎల్లో ఎలెర్ట్ జారీ చేసింది.
Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు అంటే నెల 30 వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నేడు జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, కామారెడ్డి, భద్రాద్రి, నిజామాబాద్, ఖమ్మం, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్ధిపేట, వికారాబాద సహా మొత్తం 13 జిల్లాలకు ఎల్లో ఎలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు జూలై (28వ) పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 26, 2022
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. జల దిగ్భంధంలో చిక్కుకున్న ప్రాంతాల్లోని బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు నదులను తలపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..