Gandipet Floods: గండిపేట్‌ వరదల్లో చిక్కుకున్న కుటుంబం… కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం

Gandipet Floods: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జిలపై..

Gandipet Floods: గండిపేట్‌ వరదల్లో చిక్కుకున్న కుటుంబం... కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం
Ndrf
Follow us

|

Updated on: Jul 27, 2022 | 10:58 AM

Gandipet Floods: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జిలపై నుంచి వరద నీరు పొంగుపొర్లడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఇక గండిపేటలో వదరలు ముంచెత్తుతున్నాయి. ఓ కుటుంబం ఫామ్‌హౌస్‌లో చిక్కుకుంది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. నార్సింగ్‌ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం కలిసి దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి వారిని సురక్షితంగా కాపాడగలిగారు.

పడవ సహాయంతో ఈ ఆపరేషన్‌ నిర్వహించి వారి వరదలో చిక్కుకున్నవారిని సురక్షితంగా తీసుకువచ్చారు. కాగా, గండిపేట జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో 12 గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేశారు అధికారులు. ఎంతో శ్రమించి కాపాడిన రెస్క్యూటీమ్‌కు సునీల్‌ కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరంలో భారీ వరదలు చోటు చేసుకున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. ఈ అతి అతిభారీ వర్షాల కారణంగా రోడ్లన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్ని నీటితో నిండిపోయాయి. ముందస్తు చర్యలతో తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించి వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎంతో మంది వరదల్లో చిక్కుకుని నిరాశ్రయులయ్యారు.

ఇవి కూడా చదవండి

Latest Articles