ECIL: ప్రభుత్వ కాలేజీలో ఐటీఐ చేసిన వారికి గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో భారీగా అప్రెంటిస్‌ పోస్ట్‌లు..

ECIL Recruitment 2022: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) పలు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ వివిధ ట్రేడుల్లో ఉన్న...

ECIL: ప్రభుత్వ కాలేజీలో ఐటీఐ చేసిన వారికి గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో భారీగా అప్రెంటిస్‌ పోస్ట్‌లు..
Ecil Hyderabad
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Jul 27, 2022 | 11:40 AM

ECIL Recruitment 2022: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) పలు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ వివిధ ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే ట్రేడుల్లో ఈ అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 284 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, కోపా, డీజిల్‌ మెకానిక్‌, ప్లంబర్‌, వెల్డర్‌, పెయింటర్‌ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ సర్టిఫికెట్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18-10-2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఖాళీల్లో 70 శాతం సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు, మిగిలినవి ప్రైవేట్‌ ఐటీఐ కళాశాల్లో చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు ఆయా ట్రేడుల ఆధారంగా నెలకు రూ. 7,700 నుంచి రూ. 8050 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 08, సెప్టెంబర్‌ 12ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..