Telangana Rains: పొంగుతున్న వాగు.. ఆశ్రమ పాఠశాలకు ముప్పు.. పోలీసుల సాహసంతో విద్యార్థులకు తప్పిన ముప్పు

పోచాపురంలోని కిన్నెరసాని వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.. వాగు పక్కనే ఉన్న మినీ గురుకుల ఆశ్రమ పాఠశాల సమీపంలో కిన్నెరసాని వాగు పొంగి పొర్లడంతో విద్యార్థులు ఆపదలో చిక్కుకున్నారు

Telangana Rains: పొంగుతున్న వాగు.. ఆశ్రమ పాఠశాలకు ముప్పు.. పోలీసుల సాహసంతో విద్యార్థులకు తప్పిన ముప్పు
Warangal Floods
Surya Kala

|

Jul 24, 2022 | 8:58 AM

Telangana Rains: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రంలో కూడా వానలు తగ్గినట్లే తగ్గి.. కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ కుండపోతగా కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగు పొంగి.. విద్యార్థులకు ముప్పు ఏర్పడింది. దీంతో పోలీసులు సాహసం చేశారు. ఆ ఆశ్రమ పాఠశాల విద్యార్థులను వాగుదాటించి సురక్షితంగా మరో ఆశ్రమ పాఠశాలకు తరలించారు.. వానలు, వరదల నేపథ్యంలో ములుగు జిల్లా ఏజెన్సీలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కుండపోత వర్షాలతో ములుగు జిల్లా ఏజెన్సీ అతలాకుతలం అవుతుంది.. వాగులు విగ్రరూపం దాల్చడంతో అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి.. రోడ్లు తెగిపోయి పూర్తి రవాణా వ్యవస్థ స్తంభించింది..

తాడ్వాయి మండలంలో వాగులు పొంగిపోర్లుతున్నా యి.. పోచాపురంలోని కిన్నెరసాని వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.. వాగు పక్కనే ఉన్న మినీ గురుకుల ఆశ్రమ పాఠశాల సమీపంలో కిన్నెరసాని వాగు పొంగి పొర్లడంతో విద్యార్థులు ఆపదలో చిక్కుకున్నారు.. ప్రమాదం పొంచి ఉందని గమనినించిన తాడ్వాయి పోలీసులు, రెవెన్యూ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నా ప్రాణాలకు తెగించి ఆ గ్రామానికి వెళ్లారు.. సుమారు 79 మంది విద్యార్థులను వాగు దాటించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.. వారిని తాడ్వాయి మండలం లోని కొడిశాల ఆశ్రమ పాఠశాల కు తరలించి ఆశ్రయం కల్పించారు… వరద తగ్గే వరకు విద్యార్థులను కొడిషాల ఆశ్రమ పాఠశాలలోనే ఉంచుతామని అధికారులు తెలిపారు.

Reporter: G.Peddeesh, TV9 Telugu

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu