AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెదక్ సభలో రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు..

మెదక్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. మెదక్‎లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత జిల్లా అయిన మెదక్‎కి ఏమి చేయలేదు అని సీఎం రేవంత్ కౌంటర్ చేశారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేసారు. ఆ తరువాత అంతే స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్‎కి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు.

మెదక్ సభలో రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు..
Revanth Reddy Harish Rao
P Shivteja
| Edited By: |

Updated on: Apr 21, 2024 | 12:02 PM

Share

మెదక్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. మెదక్‎లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత జిల్లా అయిన మెదక్‎కి ఏమి చేయలేదు అని సీఎం రేవంత్ కౌంటర్ చేశారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేసారు. ఆ తరువాత అంతే స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్‎కి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలదీస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు. నీళ్ళు, నిధులు అన్ని గజ్వేల్‎కే వెళ్తున్నాయి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ అన్నాట్లు గుర్తుచేశారు. అయితే ఇప్పుడేమో గజ్వేల్ అభివృద్ధి ఇందిరాగాంధీ హయాంలో అయింది అని అంటున్నారని విమర్శించారు. గజ్వేల్, సిద్దిపేటకు రైల్ తెచ్చింది కేసీఆర్ అని అలాటే మూడు యూనివర్సిటీలు తెచ్చింది కూడా కేసీఆర్ అని గుర్తు చేశారు. సీఎం రేవంత్ ఉద్దేశ పూర్వకంగానే తమపై నిందలు వేస్తున్నారని చెప్పారు.

మెదక్ జిల్లాలో మంచి ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించిన ఘనత కేసీఆర్‎కే దక్కింది అని.. సింగూర్ జలాలను మెదక్ జిల్లాకు వచ్చేలా చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. తమని సీఎం రేవంత్ విమర్శించినప్పుడు.. తాము కూడా ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు ఉందని చెప్పారు. కానీ తమకు ఉన్న విజ్ఞత కారణంగా విమర్శించడం లేదన్నారు హరీష్ రావు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీ అమలు చేస్తానని ఇంత వరకు అమలు చేయలేదని ఆరోపించారు. పార్టీలు మారిన వారిని తక్షణమే అనర్హత వేటు వేస్తామని రాహుల్ గాంధీ మానిఫెస్టోలో పెట్టారు. కానీ ఇక్కడ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిన వారికి కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. .అత్యధిక ఎమ్మెల్యే సీట్లు బీసీ, ఎస్సీలకు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని, బీసీలను, ఎస్సీలను మోసం చేసింది సీఎం రేవంత్ అన్నారు. మైనార్టీల ఓట్లు వేసుకుని గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. మైనార్టీలకు క్యాబినెట్‎లో అవకాశం కల్పించలేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనుకుంటున్నారా..? ఇది చదివితే..
రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనుకుంటున్నారా..? ఇది చదివితే..
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. ఎంత పెరుగుతాయంటే..?
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. ఎంత పెరుగుతాయంటే..?
ఎండిన అల్లం మహిమ.. ప్రతిరోజూ నీటిలో తాగితే శరీరంలో జరిగేది ఇదే..!
ఎండిన అల్లం మహిమ.. ప్రతిరోజూ నీటిలో తాగితే శరీరంలో జరిగేది ఇదే..!
ముల్లంగి అంటే అలెర్జీనా? అయితే ఈ కోలా బాల్స్ రుచి చూడండి..
ముల్లంగి అంటే అలెర్జీనా? అయితే ఈ కోలా బాల్స్ రుచి చూడండి..
ఈగోల వల్లే ఆ సినిమా సరిగ్గా తీయలేకపోయా
ఈగోల వల్లే ఆ సినిమా సరిగ్గా తీయలేకపోయా
తెలంగాణలో మూగజీవాల మారణకాండ.. 100 కుక్కలను చంపి పూడ్చిపెట్టిన..
తెలంగాణలో మూగజీవాల మారణకాండ.. 100 కుక్కలను చంపి పూడ్చిపెట్టిన..
రోజూ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగితే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే
రోజూ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగితే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే
అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!