Hyderabad: గుజరాత్ పరీక్ష పేపర్ హైదరాబాద్‌లో లీక్.. మరో రెండు గంటల్లో ఎగ్జామ్ ఉండగా ట్విస్ట్..
గుజరాత్ పరీక్ష పేపర్ హైదరాబాద్‌లో లీక్ అయింది. పరీక్షకు సరిగ్గా రెండు గంటల ముందు పంచాయతీ రాజ్‌శాఖకు సంబంధించిన పరీక్ష పేపర్ లీక్ అయింది.
గుజరాత్ పరీక్ష పేపర్ హైదరాబాద్‌లో లీక్ అయింది. పరీక్షకు సరిగ్గా రెండు గంటల ముందు పంచాయతీ రాజ్‌శాఖకు సంబంధించిన పరీక్ష పేపర్ లీక్ అయింది. ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసింది గుజరాత్ ప్రభుత్వం.
గుజరాత్ పరీక్షకు హైదరాబాద్‌తో పాటు ఆంధ్రాలోనూ పరీక్ష పేపర్లు ప్రింట్ అయ్యాయి. ఒడిశాకు చెందిన ప్రదీప్ నాయక్ ఈ పేపర్‌ను లీక్ చేసినట్లు గుర్తించారు అధికారులు. హైదరాబాద్‌కు చెందిన జీత్ నాయక్‌కు పరీక్ష పేపర్‌ను ప్రదీప్ నాయక్ అందించినట్లు తెలిసింది. దీంతో జీత్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ ఘటనలో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రాలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖలో నియామాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పరీక్ష పత్రాల ప్రింటింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేసింది. అయితే, కొందరు కేటుగాళ్ల కారణంగా హైదరాబాద్‌లో ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది. దాంతో పరీక్షను రద్దు చేసింది ప్రభుత్వం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..