AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మద్యం బాబులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న ధరలు..!

Telangana: తెలంగాణలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది ప్రభుత్వం. త్వరలో మద్యం  ధర (Liquor Price)లను తగ్గించనుంది. కోవిడ్‌ వ్యాప్తి సమయంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ..

Telangana: మద్యం బాబులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న ధరలు..!
Subhash Goud
|

Updated on: Mar 13, 2022 | 3:21 PM

Share

Telangana: తెలంగాణలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌ తెలుపనుంది ప్రభుత్వం. త్వరలో మద్యం  ధర (Liquor Price)లను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌ వ్యాప్తి సమయంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మద్యం ధరలను 20 శాతం వరకు పెంచింది. అయితే పెరిగిన ధరలతో లిక్కర్‌ విక్రయాలు తగ్గినట్లు ప్రభుత్వం గుర్తించింది. మద్యం విక్రయాలు తగ్గేందుకు ప్రధాన కారణం ధరలు (Rates) పెరుగుదలేనని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా మద్యం ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. లిక్కర్‌ అమ్మకాలు పెరిగేలా చర్యలు చేపడుతోంది. అయితే మద్యం అమ్మకాలు పెరిగేలా బీర్‌ బాటిల్‌పై రూ.10 వరకు తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా నిత్యావసర వస్తవులతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు పెరుగుతున్నప్పటికీ, మద్యంపై 17 శాతం కోవిడ్‌ సెస్‌ను తొలగించడం ద్వారా బీర్‌ ధరలను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో కోవిడ్‌ సెస్‌ను రద్దు చేశాయి. వేసవి కాలంలో బీర్ల అమ్మకాలు పెరిగేందుకు చర్యలు చేపడుతోంది.

అయితే గత ఏడాది జూలైలో బీర్‌ ధరను రూ.10 తగ్గించింది. కానీ అమ్మకాలు పెద్దగా పెరగలేదు. గోడౌన్‌లలో నిల్వలు పెరిగిపోయాయి. అయితే ధరలను తగ్గిస్తే పెరిగిన స్టాక్‌ క్లియర్‌ అవుతుందని, వేసవి ప్రారంభమైనందున మద్యం అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ధరల తగ్గింపుపై ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికార ప్రకటన రానుందని మద్యం బాబులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బార్‌లో బాటిల్‌ బీరు రూ.180 నుంచి రూ.200 వరకు తీసుకుంటుండగా, రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గుతుంది. ఇక టిన్నుల్లో ప్యాక్‌ చేసిన బీరు ధరలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Telangana: రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న ఎండలు.. హాఫ్ డే స్కూల్స్‌ను ప్రకటించిన విద్యాశాఖ

ICICI Fixed Deposit: హోలీ పండగకు ముందు గుడ్‌న్యూస్‌ తెలిపిన ఐసీఐసీఐ బ్యాంకు.. వడ్డీ రేట్లు పెంపు