AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: మనవడిని కాపాడబోయి తాత.. ఆ తర్వాత తండ్రి.. మూడు తరాల బంధాన్ని మింగిన చెరువు..

Narsampet: మృత్యువు ఏ రూపంలో వస్తుందో.. ఎప్పుడు ఎవరి ప్రాణాలు మింగేస్తుందో తెలుసుకోవడ అసాధ్యం.. వరంగల్ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదంలో మూడు తరాల బంధం జలసమాధి అయింది.

Warangal: మనవడిని కాపాడబోయి తాత.. ఆ తర్వాత తండ్రి.. మూడు తరాల బంధాన్ని మింగిన చెరువు..
Warangal
Shaik Madar Saheb
|

Updated on: Mar 13, 2022 | 3:53 PM

Share

Narsampet: మృత్యువు ఏ రూపంలో వస్తుందో.. ఎప్పుడు ఎవరి ప్రాణాలు మింగేస్తుందో తెలుసుకోవడ అసాధ్యం.. వరంగల్ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదంలో మూడు తరాల బంధం జలసమాధి అయింది. వరంగల్ నర్సంపేట మండలం చిన్నగురిజాలలో చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన (family dead) ముగ్గురు మృతి చెందారు. చెరువులో మునిగిపోతున్న మనవన్ని కాపాడేందుకు ప్రయత్నించి తాతా మనవడు అందులోనే మునిగిపోయారు. తన తండ్రి- కొడుకును కాపాడేందుకు విఫలయత్నం చేసిన బాలుడి తండ్రి కూడా అదే చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు క్షణాల్లోనే జలసమాధి కావడంతో రోదనలు మిన్నంటాయి. ఊరంతా బోరున విలపిస్తున్నారు. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని చిన్నగురిజాల గ్రామంలో ఆదివారం జరిగింది.

చిన్న గురిజాల గ్రామానికి చెందిన కృష్ణమూర్తి (65) అనే రైతు తన కొడుకు నాగరాజు (34), మనవడు దీపక్ (12) తో కలిసి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో మనవుడు దీపక్ సరదాగా చెరువులో స్నానానికి దిగాడు. ఆ బాలుడు లోతు గమనించకుండా చెరువులో మునిగిపోవడంతో.. అతన్ని కాపాడేందుకు తాత కృష్ణమూర్తి చెరువులోకి దిగాడు. దురదృష్ట వశాత్తు కృష్ణమూర్తి కూడా అందులోనే మునిగిపోయాడు. వారిద్దరూ చెరువులో మునిగి పోతుండడం గమనించిన బాలుడి తండ్రి నాగరాజు కూడా చెరువులోకి దూకాడు. చెరువులో మునిగిపోతున్న తన తండ్రి- కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నించిన నాగరాజు కూడా నీట మునిగి చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ప్రమాదంలో మూడు తరాల బంధం జల సమాదైపోయింది.. దీంతో బాధితుల కుటుంబంలో, గ్రామంలో తీరని విషాదం అలుముకుంది.

– జీ.పెద్దీష్ కుమార్, టీవీ9 తెలుగు రిపోర్టర్, వరంగల్

Also Read:

AP Crime News: కూర్చున్నట్టే కూర్చొని కత్తితో దాడి చేశాడు.. సీసీ టీవీలో రికార్డయిన షాకింగ్ దృశ్యాలు..

Vijayawada: బెజవాడలో జనసేన ఫ్లెక్సీల వివాదం.. కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ఉద్రిక్తత