Vijayawada: బెజవాడలో జనసేన ఫ్లెక్సీల వివాదం.. కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ఉద్రిక్తత
Janasena Party Flex Controversy: విజయవాడలో జనసేన ఫ్లెక్సీల వివాదం కలకలం రేపుతోంది. ఇదికాస్త జనసేనా వర్సెస్ పోలీస్ వ్యవహారంగా మారిపోయింది. జనసేన ఆవిర్భావ సభకోసం కట్టిన బ్యానర్లను
Janasena Party Flex Controversy: విజయవాడలో జనసేన ఫ్లెక్సీల వివాదం కలకలం రేపుతోంది. ఇదికాస్త జనసేనా వర్సెస్ పోలీస్ వ్యవహారంగా మారిపోయింది. జనసేన ఆవిర్భావ సభకోసం కట్టిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే పోలీసులే కాపలా కాస్తూ బ్యానర్లు తొలగిస్తున్నారని జనసేన నేతలు మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ సభకోసం విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వారథిపై బ్యానర్లు, ఫ్లెక్సీలను కార్యకర్తలు, నేతలు ఏర్పాటు చేశారు. అయితే వాటికి అనుమతి లేదంటూ మున్సిపల్ సిబ్బంది, పోలీసులు తొలగిస్తున్నారు.
ఈ విషయం తెలిసినా జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్.. స్పాట్‌కి వెళ్లి మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు ఆయనకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులే ఇదంతా దగ్గరుండి చేయిస్తున్నారని నాదెండ్ల మనోహర్ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారంటూ నాదేండ్ల ఆరోపించారు.
జనసేన ఆవిర్భావ సభ కోసం విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అధికారులు తొలగించడంపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ విషయం తెలుసుకోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read: