Chicken Rate: చికెన్ సామాన్యుడికి చిక్కనంటుంది.. నెల రోజుల్లోనే డబుల్ అయిన ధర

చికెన్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. మార్కెట్‌లో చికెన్ రేటు మోత పుట్టిస్తుంది. అబ్బా బ్రాయిలర్ అనే దగ్గరి నుంచి బాబోయ్ బ్రాయిలర్ అనే పరిస్థితులు వచ్చాయి.

Chicken Rate: చికెన్ సామాన్యుడికి చిక్కనంటుంది.. నెల రోజుల్లోనే డబుల్ అయిన ధర
Chicken Price In Ap
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2022 | 12:41 PM

ఏపీలోని నాన్-వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్ ఇది.  ముఖ్యంగా కోడి మాంసం ఇష్టంగా తినేవారికి చేదువార్త. చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి.  నెల రోజుల్లోనే ఏకంగా డబుల్ అయిపోయింది చికెన్ ధర. నెల క్రితం  రూ.140 నుంచి రూ.160 వరకు ఉన్న కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.300కి చేరింది. స్కిన్ లెస్ అయితే రూ.300 వరకు అమ్ముతున్నారు. దీంతో సండే ముక్కకు అలవాటు పడ్డవారు సైతం వెనక్కి తగ్గుతున్నారు.  ఆదివారం వస్తే రద్దీగా ఉండే విజయవాడ నాన్-వెజ్  మార్కెట్లు ప్రస్తుతం చికెన్ ధరలు పెరగడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి.  చికెన్ షాపులవైపు జేబుకి చిల్లు పడేలా ఉందని.. చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. కాగా కోళ్ల మేత, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడం, ఫారంలో కోళ్లు తక్కువగా ఉండటం వంటి కారణాల వల్లే రేట్లు పెరిగాయంటున్నారు వ్యాపారస్తులు. మరోవైపు బర్డ్‌ఫ్లూ వదంతులు రావడంతో.. గడచిన మూడు నెలల కాలంలో ఫౌల్ట్రీ రైతులు ఎక్కువగా బ్రాయిలర్ కోళ్లను పెంచేందుకు సాహసించలేదు. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. అయితే చికెన్ మన దగ్గర ఎంత ఇష్టంగా తింటారో తెలిసిందే.. పేదవారు సైతం సండే రోజు చికెన్ తెచ్చుకుంటారు.  మార్కెట్‌లో చికెన్ డిమాండ్‌కి తగ్గ కోళ్ల ఉత్పత్తి లేదు. దీంతో రేట్లు పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్‌ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు.