Andhra Pradesh: ఈ చేప విషంతో మనిషిని చంపేస్తుంది.. కోనసీమలో వలలో చిక్కింది…
ఈ చేప చూడండి ఎంత వింతగా ఉందో... విషపూరితమైనది కూడా. అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉంటుంది. మామూలుగానే కనిపించినా.. ఎవరైనా తాకారా... తనలోని మరో వెర్షన్ చూపిస్తుంది.
East godavari district: ఈ చేపను చూశారా..? చూడ్డానికి భయనకంగా, రాక్షసంగా ఉంది కదూ..! ఈ చేప నిజంగానే చాలా డేంజర్ అండీ బాబు. మనిషి మోమును పోలిన రూపంతో కనిపిస్తున్న ఈ చేపను బొంక చేపని పిలుస్తారు. బెలూన్ ఫిష్, పఫర్ ఫిష్, గ్లోబ్ ఫిష్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. నార్మల్‌గా నీటిలో ఉన్నప్పుడు మామూలు చేపలానే ఉంటుంది. కానీ ఎవరైనా పట్టుకున్నా, ప్రమాద సంకేతాలు కనిపించినా గాలి పీల్చుకుని బంతిలా ఉబ్బుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఉప్పలగుప్తం మండలంలోని వాసాలతిప్ప వద్ద జాలర్లు చేపల వేటకు వెళ్లగా.. ఈ బొంక చేప వలలో పడింది. దీని గురించి ఉప్పలగుప్తం మత్స్యశాఖాధికారి గోపాలకృష్ణ వివరిస్తూ.. టెట్రాంటిడీ కుటుంబానికి చెందినదని… దీని శాస్త్రీయనామం టెట్రాడాన్ అని తెలిపారు. ఇది ప్రపంచంలో రెండో విషపూరితమైన చేపని, దీనిలో విషం మనిషిని చంపేంత ఉంటుందని తెలిపారు. అందుకే ఇలాంటి చేప మీకు ఎప్పుడైనా కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి.
Also Read: Naga Babu: ఇకపై నా పూర్తి సమయాన్ని అందుకే వినియోగిస్తాను.. నెట్టింట్లో వైరలవుతోన్న నాగబాబు పోస్ట్..