AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: నిన్న జైలు నుంచి పరారయ్యాడు.. నేడు మళ్లీ వచ్చాడు.. అసలు ఏం జరిగిందంటే..

కర్నూలు జిల్లా జైలును ఇటీవల అత్యంత అధునాతనంగా నిర్మించారు. ఇక్కడి నుంచి ఎవరూ పారిపోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే కారాగారంలోని కాంపౌండ్‌ వాల్స్‌ అందనంత ఎత్తులో ఉన్నాయి.

Kurnool: నిన్న జైలు నుంచి పరారయ్యాడు.. నేడు మళ్లీ వచ్చాడు.. అసలు ఏం జరిగిందంటే..
Kurnool District Jail
Basha Shek
|

Updated on: Mar 13, 2022 | 11:21 AM

Share

కర్నూలు జిల్లా జైలును ఇటీవల అత్యంత అధునాతనంగా నిర్మించారు. ఇక్కడి నుంచి ఎవరూ పారిపోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే కారాగారంలోని కాంపౌండ్‌ వాల్స్‌ అందనంత ఎత్తులో ఉన్నాయి. పైగా గోడల పైన ఎలక్ట్రిక్ పెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా గోడను ఎక్కితే కరెంట్‌ షాక్‌తో అల్లాడిపోవడం ఖాయం. ఒకవేళ అన్నిటినీ తట్టుకుని గోడపై నుంచి దూకినా కాళ్లు చేతులు విరగడం ఖాయం. అలాంటి జిల్లా జైలు నుంచి నిన్న ఓ ఖైదీ తప్పించుకుని పోయాడు. దీనిపై జిల్లా జైలు అధికారులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తు సాగుతుండగానే పారిపోయిన ఖైదీ ఉదయం తిరిగి జైలులో ప్రత్యక్షమయ్యాడు. దీంతో జైలు అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే కుల్లాయి అలియాస్‌ నాని గత నెల ఓ హత్య కేసులో అరెస్టై ఫిబ్రవరి నుంచి జిల్లా జైలులో ఉంటున్నాడు. అయితే నిన్న పోలీసుల కళ్లుగప్పి జైలు నుంచి పారిపోయాడు.

నాని జైలు నుంచి పారిపోయినట్లు పోలీసులకు జైలు అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే పారిపోయిన నాని తిరిగి ఉదయాన్నే అదే జైలుకు తిరిగి వచ్చేశాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసుల పహారా మధ్య ఆ ఖైదీ జైలు నుంచి ఎలా పారిపోయాడు? తిరిగి మళ్లీ ఎందుకు వచ్చాడు? అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జైళ్లశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టనున్నారు. సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనే ఆరోపణలుండటంతో వారిపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొందరు జైలు అధికారులపై వేటు పడే అవకాశముందని తెలుస్తోంది.

Also Read:Kandikonda: నేడు మహాప్రస్థానంలో కందికొండ అంత్యక్రియలు.. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్న మంత్రి తలసాని

Spend Wise: అవసరానికి.. లగ్జరీకి తేడా తెల్సుకుని ఖర్చు చేయండి..

Balakrishna: హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం అఖండ.. చలన చిత్ర పరిశ్రమకు దిక్సూచి అన్న బాలయ్య