Viral: కుక్కల దాణా అనుకున్నారు.. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగగానే మైండ్ బ్లాంక్

డ్రగ్స్.. ప్రపంచాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య. భవిష్యత్‌లో అద్భుతాలు చేయాల్సిన యువతీయువకులు ఈ మత్తు పదార్థాల వలలో చిక్కి.. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

Viral: కుక్కల దాణా అనుకున్నారు.. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగగానే మైండ్ బ్లాంక్
Drugs
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2022 | 1:28 PM

డ్రగ్స్.. ప్రపంచాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య. భవిష్యత్‌లో అద్భుతాలు చేయాల్సిన యువతీయువకులు ఈ మత్తు పదార్థాల వలలో చిక్కి.. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు, పోలీస్ అధికారులు ఎన్ని ఆంక్షలు పెడుతున్నా, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. మత్తు పదార్థాల రవాణా ఆగడం లేదు. డబ్బులు దండుకునేందుకు అక్రమార్కులు.. డ్రగ్స్ అక్రమ రవాణాకు కొత్త కొత్త మార్గాలను అన్వేశిస్తున్నారు. తాజాగా అబుదాబిలో అధిక మొత్తంలో హెరాయిన్‌ పట్టుబడింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, కస్టమ్స్ అధికారులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్‌లో 1.5 టన్నుల హెరాయిన్‌ని ఖలీఫా పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ ఇండియన్‌ కరెన్సీ ప్రకారం 3 బిలియన్ 70మిలియన్ 368 వేల రూపాయలు అని తెలుస్తుంది.  ఇంత భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్మగ్లింగ్ చేసేందుకు.. అక్రమర్కులు కొత్త మార్గాన్ని అన్వేశించారు. అధికారులను బోల్తా కొట్టించేందుకు పక్కా స్కెచ్ వేశారు. పెట్ డాగ్స్‌కు పెట్టే.. దాణా సంచులలో హెరాయిన్‌ నింపి.. ఐరోపా దేశానికి ఎగుమతి చేసేందుకు ప్రయత్నించారు. అయితే అధికారులకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ మత్తు ముఠా గుట్టు రట్టయ్యింది. అబుదాబిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.

Also Read: Chicken Rate: చికెన్ సామాన్యుడికి చిక్కనంటుంది.. నెల రోజుల్లోనే డబుల్ అయిన ధర

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో