AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో వివాదం.. జిల్లాల విభజనపై హై కోర్టులో పిల్ దాఖలు.. అభ్యంతరాలివే

AP New Districts: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో కొత్తజిల్లాలను ఉగాది(Ugadi) నుంచి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు జిల్లా కేంద్రం, జిల్లాలపేర్లు, కొత్త జిల్లాల పై వివాదం ఇంకా..

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో వివాదం.. జిల్లాల విభజనపై హై కోర్టులో పిల్ దాఖలు.. అభ్యంతరాలివే
Ap New Districts Issue
Surya Kala
|

Updated on: Mar 13, 2022 | 11:57 AM

Share

AP New Districts: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో కొత్తజిల్లాలను ఉగాది(Ugadi) నుంచి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు జిల్లా కేంద్రం, జిల్లాలపేర్లు, కొత్త జిల్లాల పై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఏప్రిల్ 2 ఉగాదికి ఏపీలో కొత్తజిల్లాలు ఏర్పడాలని సంకల్పంతో అడుగులు ముందుకేస్తుంది. అయితే ఇపుడు ప్రభుత్వానికి కొత్త జిల్లాల ఏర్పాటు సరికొత్త చిక్కుని తెచ్చింది.

జిల్లాల విభజనపై హై కోర్టులో పిల్ దాఖలైంది. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకుండా విభజన చేయకూడదని పిల్ లో పిటిషనర్ పేర్కొన్నాడు. అంతేకాదు జనాభా లెక్కింపు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తికాకుండానే ఏపీ విభజన చట్టానికి వ్యతిరేకమని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటును విద్యా ఉద్యోగాల్లో జిల్లాలు, జోన్ల ఆధారంగా నియామకాలు చేస్తున్నారన్న పిటిషనర్ పేర్కొన్నాడు. జిల్లాల విభజనకు తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదం కావాలని.. అలా రాష్ట్రపతి ఆమోదం లేకుండా జిల్లాను విభజన చేయడం వల్ల ఇబ్బందులొస్తాయని చెప్పాడు.  హైకోర్టు లో దాఖలు చేసిన ఈ  ప్రజాప్రయోజన వ్యాజ్యం రేపు సీజే బెంచ్ ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

అయితే వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను  ఎంపీ నియోజకవర్గాల ప్రాతిపదికగా ఏర్పాటు చేయడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వచ్చే నెల 2 నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు కు వేగంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త జిల్లా ఏర్పటుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు లో పిల్ దాఖలైంది.

Watermelon Farming: పుచ్చ సాగుతో వేసవిలో కాసుల పంట.. దిగుబడి పెరగాలంటే ఈ పద్దతులు పాటించండి

Kandikonda: నేడు మహాప్రస్థానంలో కందికొండ అంత్యక్రియలు.. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్న మంత్రి తలసాని

Balakrishna: హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం అఖండ.. చలన చిత్ర పరిశ్రమకు దిక్సూచి అన్న బాలయ్య