ICICI Fixed Deposit: హోలీ పండగకు ముందు గుడ్‌న్యూస్‌ తెలిపిన ఐసీఐసీఐ బ్యాంకు.. వడ్డీ రేట్లు పెంపు

ICICI Fixed Deposit: ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ హోలీకి ముందు కస్టమర్లకు కానుక అందించింది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను మార్చింది . ICICI బ్యాంక్ వివిధ కాల..

ICICI Fixed Deposit: హోలీ పండగకు ముందు గుడ్‌న్యూస్‌ తెలిపిన ఐసీఐసీఐ బ్యాంకు.. వడ్డీ రేట్లు పెంపు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 13, 2022 | 2:11 PM

ICICI Fixed Deposit: ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ హోలీకి ముందు కస్టమర్లకు కానుక అందించింది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను మార్చింది . ICICI బ్యాంక్ వివిధ కాల వ్యవధిలో రూ 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD)లు వడ్డీ రేట్లను మార్చింది. 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 2 కోట్ల కంటే ఎక్కువ, రూ. 5 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అత్యధిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేటు 4.6 శాతం. ICICI బ్యాంక్‌లో 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం FD పొందిన కస్టమర్‌లు ప్రయోజనం పొందుతారు.

2 సంవత్సరాల కంటే ఎక్కువ, 3 సంవత్సరాల కంటే తక్కువ FD లకు 4.50 శాతం వడ్డీ లభిస్తుంది. కొత్త రేట్లు 10 మార్చి 2022 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంకు వెల్లడించింది. ICICI బ్యాంక్‌లో 15 నెలలు లేదా అంతకంటే ఎక్కువ 18 నెలల కంటే తక్కువ FDకి 4.2 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో 18 నెలలు లేదా 2 సంవత్సరాల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 4.3 శాతం వడ్డీ లభిస్తుంది. 1 సంవత్సరం నుండి 15 నెలల కాలానికి చేసిన FDపై వడ్డీ రేటు 4.15 శాతంగా ఉంటుంది. 1 సంవత్సరం కంటే తక్కువ FDలపై వడ్డీ రేట్లు 2.5 శాతం నుండి 3.7 శాతం వరకు నిర్ణయించింది బ్యాంకు. పైన పేర్కొన్న రేట్లు సాధారణ, సీనియర్ సిటిజన్ కేటగిరీలు రెండింటిలోనూ ఒకే విధంగా ఉంటాయి.

2 కోట్ల లోపు డిపాజిట్ల రేట్లలో ఎలాంటి మార్పు లేదు:

ఇది కాకుండా లైవ్ మింట్ నివేదిక ప్రకారం.. ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 5 కోట్ల కంటే ఎక్కువ FDలపై వడ్డీ రేట్లను కూడా మార్చింది. ఈ రేట్లు దేశీయ కస్టమర్లు, NRO, NREలకు వర్తిస్తాయి. అయితే రూ.2 కోట్ల లోపు డిపాజిట్ల రేట్లలో ఎలాంటి మార్పు లేదు.

ఇవి కూడా చదవండి:

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఊరటనిచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌.. ఆ ఆంక్షలు తొలగింపు

Spend Wise: అవసరానికి.. లగ్జరీకి తేడా తెల్సుకుని ఖర్చు చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో